Health

ఈ విషయం తెలిస్తే మీరు వంకాయలను తినకుండా ఉండలేరు. ఎందుకంటే..?

వంకాయలో ఫైబర్‌ ఎక్కువ. అంతేకాదు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయినీ తగ్గిస్తుంది. మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. అధిక బరువును తగ్గించడంలోనూ వంకాయ మంచి ఫలితాన్ని ఇస్తుంది. వంకాయల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌, ఆంథోసైనిన్స్‌ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. వంకాయలోని సోలోసోడైన్‌, రామ్మోసైల్‌, గ్లయికోసైడ్స్‌ అనే సమ్మేళనాలు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి. అయితే వంకాయ ఎన్నో పోషక ప్రయోజనాలను కలిగి ఉన్న కూరగాయ.

వంకాయలో పొటాషియం, సోడియం, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ కూరగాయలను తినని వారు చాలా మందే ఉన్నారు. కారణం దీనిపై ఉన్న అపోహలే. నిజానికి వంకాయ ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ.. వంకాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వంకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య కూడా పోతుంది. గుండె ఆరోగ్యం.. వంకాయను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వంకాయ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

పొటాషియం, విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్న వంకాయ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వంకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక రక్తపోటు.. పొటాషియం పుష్కలంగా ఉండే వంకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే హై బీపీ పేషెంట్లు వీటిని తినాలని చెబుతుంటారు. కొలెస్ట్రాల్..కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి వంకాయ కూడా ఎంతో సహాయపడుతుంది. వంకాయలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్.. వంకాయల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినొచ్చు. ఆహారం నుంచి గ్లూకోజ్ శోషణను నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యం..ఫినోలిక్ సమ్మేళనాలు , కాల్షియం ఎక్కువగా ఉండే వంకాయ ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తహీనత..ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే వంకాయను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్యను పోగొట్టొచ్చు.

క్యాన్సర్ ప్రమాదం..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వంకాయను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు..మెదడు పనితీరును నియంత్రించే ఆహారాలలో వంకాయ ఒకటి. వంకాయలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి. వెయిట్ లాస్..బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వంకాయల్లో కలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును తొందరగా నింపుతుంది. ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker