Ayurveda

వెదురు చెట్ల బియ్యం తింటే ఎలాంటి మొండి రోగమైన తగ్గిపోతుంది.

సాధారణ వరి మాదిరిగానే వెదురు చెట్లకు పూతపడుతుంది. ఆ తర్వాత కంకులు పడతాయి. ఐతే వెదురు మొక్క సాధారణంగా పూయదు. ఒకవేళ పూసినా ఏ వందేళ్లకో పూస్తుంది. అడవుల్లో ఉండే చాలా మంది గిరిజనులు కూడా తమ జీవిత కాలంలో ఎప్పుడూ వెదురుపూతను చూసి ఉండరు. కొన్ని వెదురు జాతులు మాత్రం 50 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంటాయి. పూతపూశాక వెదురు బియ్యం కంకులు వచ్చాయంటే.. అది చనిపోయే సమయం ఆసన్నమైనట్లే..!

అంటే జీవితకాలంలో వెదురు చెట్లు ఒకే ఒక్కసారి పూస్తాయన్నమాట. అయితే వెదురు బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తిన్నవారిలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుంది. విటమిన్‌ బీ6, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, పీచు అధికంగా ఉంటాయి. మధుమేహాన్ని, బీపీని నియంత్రించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. కీళ్ల నొప్పులను చక్కటి ఉపశమనం కలుగుతుంది. వెదురు బియ్యాన్నే కాదు వెదురు పిలకను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు.

వెదురు పిలకలను ఉడికించి వంటల్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులపాటు నీటిలో నానబెట్టి తర్వాత పచ్చడి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పులియబెట్టి వాడుతుంటారు. వెదురు పిలకలు శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా వాడుతుంటారు. వెదురు పిలకలో పిండిపదార్థాలు, ప్రోటీన్లతోపాటు కాపర్‌, ఐరన్‌, ఫాస్పరస్‌, పొటాషియం వంటి మూలకాలు, రైబోఫ్లెవిన్‌, విటమిన్‌ ఏ, కే, ఈ, బీ6 పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే ఫైటోప్టెరాల్స్‌, ఫైటోన్యూట్రియంట్స్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి.

ఈ పిలకల్లో క్యాలరీలు చాలా తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరం బరువును ఇట్టే తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నాడీసంబంధ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. గర్భిణీలు వీటిని తినడం వల్ల గర్భాశయం సంకోచం చెంది కాన్పు తేలికవుతుందని నిపుణులు చెప్తుంటారు. మధుమేహం, డిప్రెషన్‌, ఊబకాయం తగ్గడానికి కూడా వెదురు పిలకలు దోహదపడుతుంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker