Health

రోజు కొన్ని వేరుశెనగ గింజలు తింటుంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా మారుతారో తెలుసుకోండి.

వేరుశెనగ గింజలను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి పోగొట్టుకోవచ్చు. వేరుశెనగలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మం మంటను తగ్గిస్తాయి. వేరుశనగలను వేయించి, తేనెతో కలిపి తీసుకుంటే మొటిమల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోరియాసిస్‌, ఎగ్జిమా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే వేరుశెనగలు తింటుండాలి. అయితే పనిలేకుండా ఖాళీగా ఉన్న సమయంలో టైం పాస్ కోసం చాలా మంది రుచికరమైన వేరుశనగ గింజలను తినడానికి ఇష్టపడతారు.

వేరుశనగ గింజల్లో సహజ సిద్ధంగా అనేక పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేరుశనగ గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ,B విటమిన్లు , విటమిన్ E వంటి ఖనిజాలు ఉంటాయి. రోజూ వేరుశెనగ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు కలగటమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేరుశెనగకాయలు చాలా చోట్లు దొరుకుతాయి.

వేరుశెనగ గింజల వల్ల కలిగే 5 ప్రయోజనాలు:- కంటి చూపును మెరుగుపరచటానికి..కళ్ళు బలహీనంగా మారకుండా ఉండాలంటే వేరుశెనగ గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది. ఇందులో ఉండే జింక్ శరీరం విటమిన్ ఎను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రేచీకటి రాకుండా చేయటంలో సహాయపడుతుంది. ఎముకలను దృఢంగా మారాలంటే.. ఎముకలను బలోపేతం చేయాలనుకుంటే, వేరుశెనగ గింజలను తీసుకోవాలి.

వీటిలో మాంగనీస్ మరియు ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వల్ల, వేరుశెనగ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శాఖాహారం ప్రోటీన్ కు మంచి మూలం.. శాఖాహారులు ప్రోటీన్ పొందాలనుకుంటే వేరుశనగ గింజలు మంచి ఎంపిక. ఒక పిడికెడు వేరుశెనగలో 7.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. వేరుశెనగలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వేరుశెనగ తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డిప్రెషన్‌ను తగ్గించడంలో..ఇటీవలి కాలంలో మానసిక సమస్యలకు గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వేరుశెనగ తినడం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది డిప్రెషన్‌ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker