రాత్రి పడుకొనే ముందు ఈ నీటిని తాగితే ఎంత మంచిదో తెలుసుకోండి.
నీటిలో నానబెట్టిన వాము గింజలను తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల విడుదలను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అయితే వామును మనం నిత్యం ఏదొక రూపంలో తీసుకుంటు ఉంటాం.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..
పగలు తీసుకోవడం కంటే రాత్రి పడుకునే ముందు వాముని తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయట. రాత్రి పడుకునే ముందు వాము నీటిని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇందుకోసం పొడినైనా వాడొచ్చు. లేదా వాముని డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. వాముని కప్పున్నర నీటిలో వేసి మరిగించి కప్పు అయ్యే వరకూ ఉంచండి. దీనిని ఫిల్టర్ చేసి తాగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే బరువు కూడా తగ్గుతారు. ఈ వాముని పడుకునే ముందు తీసుకోవాలి. ఇందులో ముందుగా వాముని పొడిలా చేయాలి.
తర్వాత ఆ వాముని టీ స్పూన్ కంటే కాస్తా తక్కువ పరిమాణంలో గోరువెచ్చని నీటిలో కలపాలి. బాగా కలపి ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. అవసరం అనుకుంటే కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవచ్చు.. మంచి ఫలితాలు ఉంటాయి. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పుల వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే వామును భాగం చేసుకోవాలి.
గోరువెచ్చని నీటిలో వాము పౌడర్‌ని కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా కడుపు ఉబ్బరం, త్రేన్పులు, జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ఈ వాము నీళ్లు బాగా సహాయ పడతాయి. అదే విధంగా వాము నీటిని తాగడం వల్ల మహిళలకి పీరియడ్స్ టైమ్‌లో వచ్చే తిమ్మిర్లు, కడుపు నొప్పి దూరమవుతుంది.
పొత్తి కడుపు కూడా చాలా వరకూ తగ్గుతుంది అలాగే వాము పొడిని ఆలివ్ ఆయిల్ కొద్దిగా, గోరువెచ్చని నీటితో కలిపి తాగితే పంటి నొప్పి తగ్గడమే కాకుండా నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. దీంతో పాటు నోటి పరిశుభ్రతలో కూడా సహాయపడుతుంది.. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.