News

వామ్మో, భావిలో ఉన్న తాచుపామును ఎలా పట్టుకున్నారో చుడండి.

భూ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి. వీటిలో ప్రాణహాని కలిగించే అనేక జీవరాశులతో పాములు కూడా ఒకటిగా జీవిస్తున్నాయి. ప్రాణహాని ఉందని చంపుకుంటూ పోతే ఏవీ మిగలవు. ఎక్కడైనా పాములు నివాస ప్రాంతల్లో కనిపిస్తే భయపడొద్దు. అటవీశాఖ అధికారులకు తెలియజేస్తే పట్టుకెళ్లి అడవుల్లో వదులుతారు. పాములు ఎవరిని పగబట్టవు. అయితే చాలా మంది పామును చూస్తేనే భయపడతారు.

కొందరు చూడటానికి భయపడకపోయినా, పట్టుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఇంకొందరు మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా పామును చేత్తో పట్టుకుంటారు. తాజాగా ఓ యువకుడు బావి నీటిలో పడున్న ఓ కింగ్‌ కోబ్రాను చేత్తోనే బయటకు తీశాడు. వీడియోలో.. ఓ ప్రాంతంలోని బావిలో కింగ్‌ కోబ్రా పడిపోయింది.

నీటి నుంచి బయటకు వచ్చే మార్గం తెలియక అందులోనే ఉండి పోయింది. కొందరు బావి గట్టుపై నుంచి పామును పరిశీలిస్తున్నారు. ఒక యువకుడు మాత్రం ధైర్యం చేసి పామును రక్షించడానికి బావి గట్టు ఎత్తు తక్కువగా ఉన్న చోటికి చేరాడు. పామును గమనించి దాని తోక పట్టుకుని బయటకు లాగాడు. తనకు ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించిన పాము.. అతన్ని కాటు వేయడానికి ప్రయత్నించింది.

ఆ యువకుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. పామును నెమ్మదిగా బయటకు తీసి, వదిలేశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker