Health

పుచ్చకాయ కాయ కొనే ముందు అది మంచిదో కాదో ఇలా చెక్ చేసి కొనండి.

ఎండల్లో చల్లని పుచ్చకాయ తినడంలో ఉండే హాయి చెప్పలేనిది. ఎక్కువ నీరుండే ఈ పండుతో ఆకలి మాత్రమే కాదు దాహం కూడా తీరుతుంది. మార్కెట్లో ఎలాంటి పుచ్చకాయను ఎంచుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. పుచ్చకాయ పూర్తిగా పండిపోయి లోపల ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం కొంచెం కష్టమే. కోసి చూస్తే కానీ అర్థం కాదు. పుచ్చకాయ లోపల ఎర్రగా నీళ్లతో ఉన్నపుడే అది రుచిగా ఉంటుంది. ఇలాంటి పుచ్చకాయలోనే పోషకాలు కూడా ఉంటాయి. పుచ్చకాయ బాగా పండినపుడే అందులో లైకోపిన్ తో పాటు ఇంకా చాలా యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది.

పుచ్చకాయ మధుమేహులు తినగలిగే పండు. గుండె జబ్బులు, క్యాన్సర్లను నివారిస్తుంది. అయితే వేసవి కాలంలో మనకు విరివిగా లభించే పండు పుచ్చ. దీంతో మనకు ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటంతో వడదెబ్బను దూరం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది. ఈ నేపథ్యంలో పుచ్చకాయను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కాయ మనకు సరిగా ఉండదు. కోయకముందు కాయను చూస్తే బాగానే కనిపిస్తుంది. కానీ కోసిన తరువాత అందులో మనకు కొన్ని సరిగా ఉండవు. దీంతో తినడానికి ఇబ్బందులు పడుతుంటాం.

కాయ పరిమాణం.. కాయ పరిమాణం ఒకే రీతిగా ఉండాలి. ఎలాంటి గాయాలు, కోతలు లేకుండా చూసుకోవాలి. ఒకవైపు చూసి కొనుగోలు చేయొద్దు. రెండు వైపులా పరిశీలించి మాత్రమే కాయను కొనుక్కోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. కాయను మొత్తం పరిశీలించి చూసుకోవాలి. అప్పుడే మనకు రుచి బాగుంటుంది. అంతేకాని ఒకవైపు చూసి మోసపోవద్దు. రంగు కాయ రంగు ఒకేలా ఉండాలి. ఒకవైపు పచ్చగా మరోవైపు తెల్లగా ఉంటే కాయ పక్వానికి రానట్లు లెక్క. ఫీల్డ్ స్పాట్ తెల్లగా లేదా ఆకుపచ్చగా ఉంటే అది పక్వానికి రాలేదని గ్రహించుకోవాలి. కాయను కొడితే కూడా దాని గుణం తెలుస్తుంది.

కొట్టినప్పుడు బోలు ధ్వని కలిగి ఉంటే అది పండినదిగా గుర్తించాలి. అలా కాకుండా మందమైన ధ్వని కలిగి ఉంటే అది పండలేదని తెలుసుకోవాలి. కాయ తోలు.. పుచ్చకాయ తోలు నిస్తేజంగా ఉండాలి. దాని తోలు మెరుస్తూ ఉంటే అది ఇంకా పండలేదని అర్థం. పక్వానికి వచ్చిన కాయ చర్మం మందంగా ఉంటుంది. దానిపై మచ్చలు, దెబ్బలు లేకుండా చూసుకుంటేనే మంచిది. పుచ్చకాయ పండితే బరువు ఎక్కువగా ఉంటుంది. బరువు తక్కువగా ఉంటే అది పండలేదని గ్రహించుకోవాలి.

పండిన కాయలో నీరు ఉండటం వల్ల బరువు అధికంగా ఉంటుంది. వాసన..పుచ్చకాయ పండితే తీపి వాసన వస్తుంది. పండలేదంటే ఎలాంటి వాసన ఉండదు. ఇలా చెక్ చేసుకుని కొనుక్కుంటే మనకు ఇబ్బందులు రావు. కుటుంబమంతా హాయిగా తినొచ్చు. ఇలా పుచ్చకాయను కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుని కొనుక్కుంటే సమస్యలు రావు. మంచి కాయ మన సొంతం అవుతుందని తెలుసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker