కరోనా కంటే వేగంగా ప్రమాదకరమైన మరో వైరస్ రాబోతుంది : WHO

రానున్న పదేళ్లలో కరోనా తరహాలో మరో ప్రమాదకరమైన మహమ్మారి మానవాళిని కబళించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.ఇది కోవిడ్-19 వైరస్ కంటే ఎక్కువగా 27.5శాతం మేరా ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ వ్యాధి వేగంగా వ్యాపించి మనిషి ప్రాణాలను అంతే వేగంగా తీసుకుపోతుందని వెల్లడించింది.
అయితే కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోం. కొవిడ్ కంటే ప్రమాదకరమైన మహమ్మారి పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని టెడ్రోస్ అధనోం తాజాగా హెచ్చరించారు. రాబోయే మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని సోమవారంన హెచ్చరించారు.
COVID-19 మహమ్మారి కోసం గ్లోబల్ ఎమర్జెన్సీ స్టేటస్‌ను ముగించిన వారం తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ సూచనలు చేశారు. ”కొవిడ్‌పై అత్యవసర స్థితి ఎత్తివేసినంత మాత్రాన కోవిడ్ ముప్పు తప్పినట్లు కాదన్నారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో టెడ్రోస్ తాజాగా ప్రపంచ ఆరోగ్య పరిస్థితులపై తన నివేదికను సమర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతు కొత్త వేరియంట్ల కారణంగా మరో మహమ్మారి పుట్టుకకు అవకాశాలున్నాయని.
దీంతో మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. అవి కోవిడ్ కంటే ప్రాణాంతకమైన వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. వివిధ రకాల సమస్యలు మూకుమ్మడిగా పుట్టుకొస్తున్న క్రమంలో అన్ని సందర్భాలకూ తగిన ప్రపంచ స్థాయి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కోవిడ్ ఆఖరిది కాదు మరో సంక్షోభం కచ్చితంగా వస్తుంది. అప్పుడు దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అందరు సిద్ధంగా ఉండాలని దానకి తగిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచిచారు.ప్రతీ ఒక్కరు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.