News

డిఎస్పీ, ఎస్సై సహా 50మందిని పెళ్లాడిన నిత్య పెళ్లికూతురు. నిత్య పెళ్లికూతురి కథ తెలిస్తే షాక్!

తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురానికి చెందిన ఓ యువకుడు బేకరిలో పని చేస్తున్నాడు. అతనికి 35 ఏళ్లు నిండినా.. పెళ్లి కాకపోవడంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ‘అంబి డేట్ ద తమిళ్ వే’లో రిజస్టర్ చేసుకున్నాడు. ఈ వెబ్‌సైట్‌లోనే సంధ్య అనే మహిళ పరిచయమైంది. పూర్తీ వివరాలోకి వెళ్తే ఒక్కసారి మూడు ముళ్లు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు తోడుంటామనే భరోసా కల్పిస్తుంది. అలాంటిది ఓ మహిళ పెళ్లినే ఆటగా మార్చేసింది. తాళినే ఎగతాళి చేస్తూ.. సింపుల్‌గా భర్తలను మార్చేస్తూ ఎందరి జీవితాలతోనో ఆడుకుంది.

పెళ్లి అయిన తర్వాత అందినకాడికి నగలు, డబ్బుతో ఉడాయించేది. ఇలా పోలీస్ అధికారులతో సహా దాదాపు 50 మందిని మోసం చేసిన మాయలేడి ఉదంతం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. తమిళనాడులో ఈ నిత్య పెళ్లికూతురి మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు తిరువూరుకు చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి పెళ్లి కాకపోవడంతో వధువు కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ‘ద తమిళ్ వే’ అనే వెబ్ సైట్ ద్వారా సంధ్య అనే మహిళ పరిచయమైంది.

ఇద్దరూ ఇష్టపడగా.. తన తల్లిదండ్రులను ఒప్పించి మరీ ఆమెను సదరు వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగుతుందనుకునే టైంలో మొదటి రాత్రి తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త, అతని కుటుంబ సభ్యులు సదరు మహిళ ఆధార్ కార్డు చెక్ చేశారు. అందులో భర్త పేరు వేరే ఉంది. దీనిపై ఆమెను నిలదీయగా.. చంపేస్తానంటూ భర్తనే బెదిరించింది. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో సంధ్య గురించి షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆమె ఇదివరకే 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఓ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, మధురైలో మరో పోలీస్ అధికారి, ఓ ఫైనాన్స్ అధికారితో సహా 50 మంది ఆమె బాధితుల లిస్టులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఫస్ట్ నైట్ అయ్యాక గొడవపడి తర్వాత ఇంట్లోని డబ్బులు, నగలతో పరారీ అవుతుందని విచారణలో తేల్చారు. ఇలా జరిగిన తర్వాత కుటుంబం పరువు పోతుందని బాధితులు మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే.. ఫోటోలు బయటపెడతానని బెదిరింపులకు దిగేదని.. ఇలా పదుల సంఖ్యలో మోసం చేసిందని పోలీసుల విచారణలో తేల్చారు. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిత్య పెళ్లికూతురిని అదుపులోకి తీసుకున్న తిరుపూర్ పోలీసులు విచారిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker