Health

గర్భిణీ స్త్రీ కడుపు తాకడం మంచిదేనా..? అందరు చేస్తున్న తప్పులు ఇదే.

గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన కాలం. ఈ సమయంలో ఆమె ఆహారం, వ్యాయామం మరియు చర్మ సంరక్షణ నుండి తనను తాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తొమ్మిది నెలల్లో, కొంతమంది మహిళలు పెరుగుతున్న పొట్ట కారణంగా కొన్ని స్థానాల్లో కూర్చోవడం కష్టం. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు అన్ని సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా ఉన్నాగాని అది పుట్టబోయే బిడ్డపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీ ఇప్పటివరకు ఉన్న కొన్ని అలవాట్లను మానుకోవాలి. అయితే కాబోయే తల్లి గర్భాన్ని టచ్ చేయడం ఆమోదయోగ్యమైనదేనా? దానికి హద్దులున్నాయా? ఈ అంశంపై నిపుణులు భిన్నమైన దృక్కోణాలు కలిగిన ఇద్దరు గర్భిణీలపై అధ్యయనం చేశారు.

అయితే వారి నిర్ణయాల ప్రకారం.. ఆమె ఆహ్వానం, అనుమతి లేకుండా గర్భిణీ స్త్రీ కడుపు తాకడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఎందుకంటే బొడ్డు తాకడం అనేది ఆ మహిళ సన్నిహత ప్రాంతాన్ని టచ్ చేయడం. కాబట్టి ఆమె ఆమోదం లేకుండా తాకడం అస్సలు మంచిది కాదు. ఈ స్థలం కేవలం భాగస్వాములు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, వారు సన్నిహితంగా భావించే వ్యక్తుల కోసం మాత్రమే. వారు కూడా ఆమె అనుమతి లేకుండా టచ్ చేయకూడదని తెలిపారు. పరిచయస్తులు, సహోద్యుగులు, అపరిచితులు నెలలు నిండిన కడుపును తాకడం ఆమోదయోగ్యం అస్సలు కాదు.

నెలలు నిండుతున్న గర్భాన్ని టచ్ చేయాలా వద్దా అనేది టచ్ చేయాలనుకునేవారి ఇంగితంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ముట్టుకున్నప్పుడు గర్భిణీ స్త్రీ కంఫర్ట్​గా లేకుంటే దాని ప్రభావం పిల్లలపై చూపిస్తుంది అంటున్నారు. కాబట్టి గర్భిణీ ముట్టుకోవద్దని చెప్తే దానిని తాకకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. స్త్రీ వ్యక్తిగత సూచనలను కచ్చితంగా అందరూ పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఎవరైనా కడుపును రబ్ చేయాలని కోరుకుంటే.. ముందు కచ్చితంగా ఆమె పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు. తమ గర్భంపై ఇతరులు తాకడాన్ని స్వాగతించని స్త్రీలు ఎదుటివారిని సున్నితంగా తిరస్కరించవచ్చు.

లేదంటే మీరు ఏదైనా శబ్ధం లేదా చేష్టల ద్వారా ఎదుటివారికి మిమ్మల్ని ముట్టుకోవద్దని చెప్పవచ్చు. అయితే మీరు స్ట్రాంగ్​గా వద్దని చెప్పినా.. నవ్వుతూ తిరస్కరించడమే మంచిది. ఎందుకంటే ఎదుటివారు మీకు విషెష్ చెప్పడానికి, వారి ఆప్యాయతను మీకు చూపించాలని తాకేందుకు సిద్ధమై ఉండొచ్చు. కాబట్టి మీరు కాస్త నవ్వుతూ దానిని తిరస్కరించవచ్చు. ఎందుకంటే పెళ్లి కావడం కొత్త జీవితం అనుకుంటారు కానీ.. పిల్లల్ని కనడమే నిజమైన కొత్తజీవితం. ఇది మహిళల్లో శారీరక, మానసిక మార్పులను తీసుకువస్తుంది.

ఈ సమయంలో వారి భావోద్వేగాలు సంక్లిష్టంగా ఉంటాయి. కాబట్టి ఆమె కడుపును టచ్ చేసే ముందు ఆమె పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి. ఆమె ఓకే అంటేనే మీరు గర్భాన్ని తాకాల్సి ఉంటుంది. లేదంటే దూరంగా ఉండాల్సిందే. అయితే గర్భం ధరించిన స్త్రీ మాత్రం తన కడుపును రబ్​ చేసుకుంటూ.. లోపలి శిశువుతో మాట్లాడుతూ హాయిగా సమయాన్ని వెచ్చించవచ్చు. ఆమె అలా చేస్తుంది కదా మేము కూడా అలానే ఉంటాము అంటే కచ్చితంగా తప్పు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker