News

యూట్యూబ్ లో కనిపించే ఈ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా..?

ప్రస్తుతం మనం చూసే హీరోయిన్లు సైతం ఒకప్పుడు ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించి హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేశారు. ఇక వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మనము ఎప్పుడు యూట్యూబ్ ని ఓపెన్ చేసిన ఒక అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి కేవలం యూట్యూబ్లో తప్ప మరి ఎక్కడా కనిపించదు. నవ్వుతూ కనిపించే ఆ అమ్మాయి వెనుక పెద్ద స్టోరీనే ఉంది.

అయితే సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ లో కనిపించే ఈ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. అమెరికాలో నివసిస్తున్న ఈమె ఇండియా సంతతికి చెందిన అమ్మాయే. మార్కెటింగ్ లో బ్యాచ్ లర్ డిగ్రీ చేసిన ఈమె ప్రిన్సిపుల్ ఆఫ్ అకౌంటింగ్ లో పీజీ చేశారు. అలాగే బిజినెస్ ఎకనామిక్స్ కూడా చదివారు.

ఆ తరువాత ఆమె చాబ్రా కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థను నడుపుతున్నారు. ఈక్రమంలో ఆమెకు ఫేస్ బుక్ యాడ్ లో నటించాలన్న ఆఫర్ వచ్చింది. దీంతో 6 సంవత్సరాల క్రితమే ఈ యాడ్ లోనటించారు. ఫేస్బుక్ లో టెక్నికల్ రిక్రూటర్ గా, మార్కెటింగ్ మీడియా మేనేజర్ గా ఫేస్ బుక్ లో పనిచేశారు.

అయితే ప్రస్తుతం ఆమె అందులో పనిచేయడం మానేశారు. ప్రస్తుతం ఆమె శాన్ ప్రాన్సిస్కోలో రా బ్లాక్స్ లో రీక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుపుతున్నారు.

అంతేకాకుండా లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థను కూడా కో ఫౌండర్ గా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా ఉద్యోగం కోల్పోయిన వారికి చేయూతనందిస్తున్నారు. 2020 కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతే ఈ సంస్థ నుంచి ఆదుకున్నారు. కానీ నుపుర్ సాహిల్ అనే వ్యక్తిని 17 అక్టోబర్ 2020లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల కిందట కనిపించిన ఆమెు పిక్ ప్రస్తుతం కనిపించడం లేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker