యువతలో కీళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఇదే. ఇంకా నిర్లక్ష్యం చేస్తే..?

చిన్న చిన్న పనులకే అలసట, షుగర్, బీపీ కీళ్ళనొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వయసు పెరిగే కొలదీ ఏర్పడే సమస్య మోకాళ్ల నొప్పులు.. అయితే నేటి కాలంలో మోకాళ్ల నొప్పుల సమస్య యువతలో కూడా కనిపిస్తోంది. కీళ్ళ నొప్పుల బారిన పడిన వారు నొప్పి నుంచి ఉపశమనం కోసం వైద్యుల సూచనలనే కాదు.. ఇంట్లోనే సింపుల్ చిట్కాలను కూడా అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇలా నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలోని యూరిక్ యాసిడ్ పరిమాణాలు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అతిగా పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్లలోకి చేరుకొని స్పటికంలా తయారవుతుంది. దీనికి కారణంగా కీళ్ల నొప్పులతో పాటు కొందరిలో మోకాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఈ కీళ్ల నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు:-రాత్రి అతిగా తినడం.. ప్రస్తుతం చాలామంది రాత్రి అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకొని నిద్రపోతున్నారు.
ఇలా చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడమే కాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు రాత్రిపూట కేవలం పండ్ల ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉన్నాయి. ఆధునిక జీవనశైలి..ఆధునిక జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని చాలామంది అనారోగ్యకరమైన అలవాట్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీని కారణంగా సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
ఆధునిక జీవనశైలి అనుసరించే వారు ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, మద్యపానం సేవించడం వంటి అలవాట్ల కారణంగా కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు. నీటిని తక్కువగా తాగడం..కొంతమంది పనిలో భాగంగా నీటిని తాగడం మర్చిపోతారు దీని కారణంగా శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయే అవకాశాలున్నాయి. కాబట్టి కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలని ప్రతి రోజు నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
నిద్ర లేకపోవడం..ఇటీవల వెళ్లడైన పరిశోధనల ప్రకారం.. శరీరానికి తగిన మోతాదులో నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. కొంతమంది గుండెపోటు సమస్యల బారిన పడి మరణిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలకు కూడా పేరుకుపోతున్నాయి. తద్వారా కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు తగిన మోతాదులో నిద్రపోవడం శరీరానికి చాలా మంచిది.