News

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100వ వ సారి రక్తదానం చేసిన నటుడు. దీంతో మెగాస్టార్ ఏం చేసాడో చుడండి.

26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే.వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది.ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు.

అయితే తాజాగా ఒక నటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 100 వ సారి రక్తదానం చేసి రికార్డ్ సృష్టించాడు. అతనే మహర్షి రాఘవ. మహర్షి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరు స్నేహితుల్లో ఒకడిగా కనిపించాడు.

చిరు తో మంచి స్నేహం ఉన్న ఆయన.. చిరు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు 100 సార్లు రక్తదానం చేసి చరిత్ర సృష్టించాడు. ఇక దీంతో చిరు.. ఆయనను స్వయంగా ఇంటికి పిలిచి సన్మానించారు. ” నేను బ్లడ్ బ్యాంకు స్టార్ట్ చేసినప్పుడు మొదటగా రక్తం ఇచ్చింది మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ.

ఇప్పటివరకు అందరూ 60, 70 సార్లు ఇచ్చారు కానీ 100 సార్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి మహర్షి రాఘవ.ఆయనను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ చిరు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker