చీరకట్టులో బ్యాక్ చూపిస్తూ అనసూయ డాన్స్, డ్యాన్స్ అదిరిపోయింది అంటూ..!
అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందచందాలతో హల్చల్ చేస్తోంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఒకరైన అనసూయ.. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేస్తోంది. అనసూయ భరద్వాజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు యాంకర్ గా ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇక సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో పాటుగా, ఫాస్ట్ లో ఆమె చేసిన షోలకు సంబందించిన వీడియోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో అనసూయ గుచ్చి గుచ్చి చంపమాకు రయ్య’ అనే సాంగ్ నాటి నాటి స్టెప్స్ వేస్తూ తన అంద చందాలతో హావ భావాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.
ఆ వీడియోను ఈ మధ్యే అనసూయ షేర్ చేసింది.. చూస్తుంటే ఆ డ్యాన్స్ జబర్దస్త్ లో స్టేజ్ మీద చేసినట్లు వెనుక బ్యాగ్రౌండ్ చూస్తే తెలుస్తుంది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మళ్లీ ఆ వీడియో మరోసారి వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో చేస్తుంది.. ఆ సినిమాలో దాక్షాయని పాత్రలో నటిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటుగా తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తుంది.. దాదాపుగా నాలుగు, ఐదు సినిమాల్లో నటిస్తుందని సమాచారం..