500 Note: ఇప్పటికిప్పుడు 500నోట్లను రద్దు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

500 Note: ఇప్పటికిప్పుడు 500నోట్లను రద్దు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
500 Note: కొందరు ₹500 రూపాయల నోట్లను చలామణి నుంచి తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పరిశోధించినప్పుడు ఆర్‌బీఐ బ్యాంకులకు నిజంగానే ఒక ఆదేశం జారీ చేసింది. అయితే ఈ ఆదేశంలో ₹500 రూపాయల నోటును నిలిపివేయడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే పాతనోట్ల స్థానంలో తీసుకువచ్చిన రూ.2000 నోట్లను కూడా 2023 మే 19న చెలామణి నుండి ఉపసంహరించుకుంది కేంద్రం.

బ్యాంకుల ద్వారా ఈ 2000 కరెన్సీ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా రూ.500 కరెన్సీ నోట్లను కూడా కేంద్రం చెలామణి నుండి తప్పించే ప్రయత్నం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఇటీవల దేశంలోని బ్యాంకులకు రూ.200, రూ.100 కరెన్సీ నోట్ల వాడకాన్ని పెంచాలని… ప్రజల్లోకి ఇవి ఎక్కువగా వెళ్లేలా చూడాలని సూచించింది.
Also Read: నాగార్జున.. సమంతని కలిసే సీన్.
దీంతో రూ.500 నోట్లను కూడా చెలామణిలోంచి తప్పించేందుకు కేంద్రం సిద్దమైందని… అందుకే చిన్ననోట్ల చెలామణిని పెంచాలని ఆర్బిఐ ద్వారా ఆదేశాలు ఇప్పించిందని ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రూ.500 నోట్లను కూడా రద్దుచేస్తే బాగుంటుందని బహిరంగంగానే మాట్లాడారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయనకు ఏదయినా సమాచారం ఉండే ఈ కామెంట్స్ చేసివుంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్.
ఇలా చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ఈ రూ.500 నోట్ల రద్దు ప్రచారానికి మరో కారణం. ప్రస్తుతం రూ.500 నోటు రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు భారంగానే మారింది. చాలా ఈజీగా ఈ నోట్లను పోలిన నకిలీ నోట్లను తయారుచేస్తున్నారు.దీంతో ప్రజల్లో నకిలీ నోట్ల ప్రవాహం పెరిగిపోతోంది. ఇదికూడా ఈ నోట్లను చెలామణినుండి తప్పిస్తారనే ప్రచారానికి కారణం. కానీ ఈ ప్రస్తుతం మార్కెట్ లోని కరెన్సీలో 86 శాతం రూ.500 నోట్లే ఉన్నాయి.
Also Read: హీరోయిన్ సిమ్రాన్ ఎంత మంది హీరోలతో ఎఫైర్ నడిపించిందో తెలుసా..?
కాబట్టి ఒకేసారి ఈ నోట్లను చెలామణినుండి తప్పిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. అలాగే రూ.500 నోట్లను తప్పిస్తే చిన్ననోట్లను ఎక్కువగా ప్రింట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్బిఐపై ప్రింటింగ్ బారం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2021లో నోట్ల ప్రింటింగ్ కు రూ.4,012 కోట్లు, 2024 లో 5,101 కోట్లు, 2025 రూ.6,372 కోట్లు ఖర్చు అయ్యింది… ఇలా ఏటేటా ప్రింటింగ్ ఖర్చు పెరుగుతూనే ఉంది. రూ.500 నోట్లను చెలామణి నుండి తప్పిస్తే ఈ ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశాలున్నాయి.