Akkineni Nagarjuna: నాగార్జున మొదటి భార్య లక్ష్మి,రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.

Akkineni Nagarjuna: నాగార్జున మొదటి భార్య లక్ష్మి,రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. టాలీవుడ్ లో లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు గా వెండితెరకు పరిచయమైన నాగార్జున తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక శివ గా.. ఒక కింగ్ గా.. ఒక మన్మధుడు గా… ఒక అన్నమయ్య గా ఇలా ఎన్నో పాత్రలతో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నారు.

అయితే నాగార్జున ఫస్ట్ లక్ష్మిని పెళ్లి చేసుకోగా వారికి జన్మించిన కుమారుడే నాగ చైతన్య. 1990 సంవత్సరంలో లక్ష్మి తో విడాకులు తీసుకొని విడిపోయారు నాగార్జున. నాగార్జునలాగే ఆయన మొదటి భార్య లక్ష్మి కూడా విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లాడిన వ్యక్తి పేరు శరత్. అసలు పేరు శరత్ విజయరాఘవన్. ఆయన శ్రీరామ్ మోటార్స్ సంస్థను నడుపుతున్నారు.
Also Read: నాగార్జున.. సమంతని కలిసే సీన్.
వీరి పెళ్లి తర్వాత లక్ష్మి తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. అంతేకాదు లక్ష్మి రెండో పెళ్లి నాగచైతన్యకు ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరగింది. తల్లితో అప్పుడప్పుడు మాట్లాడటం తప్పించి వారి దగ్గరకు చైతూ వెళ్లడని రూమర్స్ బాగా వచ్చాయి. కానీ అవన్నీ అసత్యాలని, అందులో ఎటువంటి నిజం లేదని నాగచైతన్య నిశ్చితార్థం, పెళ్లి తరువాత అందరికి క్లారిటీ వచ్చింది. ఈ నిశ్చితార్థ వేడుకకు తన రెండో భర్తతో కలిసి వచ్చి తన కుమారుడిని ఆశీర్వదించారు లక్ష్మి.
Also Read: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్.
అంతే కాదు వీరంత గ్రూఫ్ ఫోటో కూడా దిగారు. అమలతో లక్ష్మి మాట్లాడిన ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి. నాగచైతన్య తన తల్లి ఫ్యామిలీతో కలిసి సపరేట్ గా ఫోటో కూడా దిగారు. ఇక రీసెంట్ గా అఖిల్ పెళ్లి కూడా అయ్యింది. అఖిల్ ది కూడా మొదటి పెళ్లి అవ్వకుండానే క్యాన్సిల్ చేసుకుని రెండోసారి కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. గతంలో వ్యాపార వేత్త జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ ను ఆయన ప్రేమించారు. నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు.
Also Read: హీరోయిన్ సిమ్రాన్ ఎంత మంది హీరోలతో ఎఫైర్ నడిపించిందో తెలుసా..?
పెళ్లి కోసం ఇటలీ వెళ్లబోయే సమయానికి ఏమయ్యిందో ఏమో కాని వీరి పెళ్లి బ్రేకప్ అయ్యింది. ఆతరువాత నుంచి చాలా గ్యాప్ ఇచ్చిన అఖిల్.. మరో వ్యాపారవేత్త ఫ్యామిలీకి చెందిన జైనాబ్ తో ప్రేమలో పడ్డాడు. రీసెంట్ గానే వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.