Soaked Amla: తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే.. మీ కాలేయం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది.

Soaked Amla: తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే.. మీ కాలేయం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది.
Soaked Amla: నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. అయితే రోజు ఒక తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయ తినడం వల్ల..రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

తద్వారా జలుబు, జ్వరం నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఏ కాలంలో అయినా కానీ ఇది తినవచ్చు. ఉసిరికాయ..జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణక్రియను సులభం చేస్తుంది. అంతేకాదు మలబద్ధకం ఉంటే..రోజు ఇలా తేనెల ఊరబెట్టిన ఉసిరికాయ ఒకటి తినడం వల్ల అది కాస్త తగ్గిపోతుంది. ఎంతోమంది మొహం బాగుండడం కోసం ఎన్నో క్రీములు పూస్తూ ఉంటారు చాక్.
Also Read: నేరేడు గింజలను ఇలా చేసి తీసుకుంటే చాలు.
అయితే వాటన్నిటికన్నా రోజుకొక ఉసిరికాయ తింటే చాలు..మొహం కాంతివంతంగా తయారవుతుంది. చర్మాన్ని తేజోవంతంగా మార్చి ముడతలు తక్కువ అవుతాయి. శరీరంలోని విషపదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మేటబాలిజం వేగవంతం చేసి బరువు తగ్గదాన్ని సులభం చేస్తుంది.
Also Read: పీరియడ్స్ సమయంలో ఆ నొప్పులు వేధిస్తున్నాయా..?
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చూపుని పదునుగా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపున 1 తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే ఆరోగ్యం మెరుగవుతుంది.