American Dates: ఈ కాయలు వారానికి ఒక్కసారైనా తినండి, తింటే మీ గుండె పూర్తీ ఆరోగ్యంగా ఉంటుంది.

American Dates: ఈ కాయలు వారానికి ఒక్కసారైనా తినండి, తింటే మీ గుండె పూర్తీ ఆరోగ్యంగా ఉంటుంది.
American Dates: అమెరికన్ ఖర్జూరాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ పండు అందమైన నారింజ రంగులో ఉంటుంది. కాస్త ఉప్పు, తీపి కలిసిన రుచిని కలిగి ఉంటుంది. కానీ, ఈ పండును పోషకాలతో నిండిన పవర్ హౌస్‌గా పిలుస్తారు. అమెరికన్ ఖర్జూరాల్లో టన్నుల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే అమెరికన్ ఖర్జూరంతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి దోహదపడతాయి. వారానికి ఒకసారి తింటే.. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. సీజనల్ వ్యాధుల సమయంలో శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి యాంటీఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది. అమెరికన్ ఖర్జూరం బర్, ఫ్లేవనాయిడ్లు వంటి మొక్కల సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటుంది.
Also Read: ప్రతి రోజు రాత్రి 10గంటలలోగా నిద్రపోతే చాలు.
ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు వాపును తగ్గించడంలో చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. గుండెను బలోపేతం చేయడమే కాకుండా రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. ప్రేగు కదలికలకు, సరైన పనితీరుకు అమెరికన్ ఖర్జూరం దోహదపడుతుంది. ఈ పండు ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది దంతాలను శుభ్రపరిచి.. నోటిని తాజాగా ఉండేలా చూస్తుంది.
Also Read: పీరియడ్స్ సమయంలో ఆ నొప్పులు వేధిస్తున్నాయా..?
కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులోని విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్ వంటి ఇతర కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కళ్ళకు చాలా మంచిది. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం మెరిసేలా చేస్తుంది.