Anudeep KV: డైరెక్టర్ అనుదీప్ కు ఘోర అవమానం..! గుర్తు పట్టక నెట్టేసిన పోలీసులు, వీడియో వైరల్.

Anudeep KV: డైరెక్టర్ అనుదీప్ కు ఘోర అవమానం..! గుర్తు పట్టక నెట్టేసిన పోలీసులు, వీడియో వైరల్.
Anudeep KV: వీరమల్లు సినిమాపై ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఎలాగూ అదే పనిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ జ్యోతి కృష్ణ నుంచి ఇలాంటి ప్రొడక్ట్ వస్తుందని, ఇంత బాగా తీస్తున్నారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇప్పటి వరకు అయితే ట్రైలర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన అనుదీప్ రెగ్యులర్‌గా టీవీల్లో కనిపిస్తూనే ఉంటాడు,

అంతే కాకుండా ఆయన మరో సినిమాను చేశాడు, సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి వైరల్ అవుతూనే ఉంటాడు. అలాంటి అనుదీప్‌ను ఆ పోలీసు గుర్తు పట్టలేదు. అనుదీప్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది, అతడిని చాలా మంది రోల్ మోడల్‌గా తీసుకుంటారు. కానీ కొందరిలో ఇప్పటికీ అనుదీప్‌కి గుర్తింపు దక్కలేదు అనేందుకు ఇదే సాక్ష్యం.
Also Read: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..!
అనుదీప్ కాస్త హడావిడిగా స్టేజ్ ఎక్కేందుకు ప్రయత్నించినా కూడా పోలీసులు ఎవరో సెలబ్రిటీ అనుకునే వారు. కానీ అనుదీప్ ఒక్కడే సింగిల్‌గా వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అందరి ముందు పరువు పోయిందిగా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ క్రియేట్ చేస్తున్నారు, అందరూ చూశారు అంటూ అనుదీప్ స్టైల్‌లో మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు.
సాధారణంగానే అనుదీప్ సోషల్ మీడియాలో చిన్న విషయానికి పెద్దగా వైరల్ అవుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఈ విషయంతో మరింతగా వైరల్ అవుతున్నాడు. హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్ లాంచ్‌కి ఆహ్వానించి మా అనుదీప్‌ను మరీ ఇంతగా అవమానిస్తారా అంటూ చాలా మంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుదీప్ కామెడీని ఇష్టపడే వారు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.