News

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక, వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు.

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక, వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు.

Rain Alert:రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం వానలు కురిసే శుభవార్తను వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ నెలలో మోస్తరు వర్షాలు పడగా, ప్రస్తుతం జూలై మొదటి వారం నుంచే వర్షాకాలం తన ప్రభావాన్ని చూపించబోతోంది. అయితే సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read: బ్యాంక్ స్కాం నిర్మాత‌ అల్లు అర‌వింద్‌.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది.

బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.

Also Read: డైరెక్ట‌ర్ అనుదీప్ కు ఘోర అవ‌మానం..!

గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker