Nidhhi Agerwal: మళ్లీ వేణు స్వామితో పూజలు చేయించుకున్న నిధి, ప్రత్యేక పూజలు అందుకేనా..?

Nidhhi Agerwal: మళ్లీ వేణు స్వామితో పూజలు చేయించుకున్న నిధి, ప్రత్యేక పూజలు అందుకేనా..?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ వేణు స్వామితో కనిపించడం ఇదేమీ మొదటి సారి కాదు. సుమారు రెండేళ్ల క్రితం కూడా వేణుస్వామితో పూజలు చేయించిందీ అందాల తార. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు బాగానే సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరముల సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read: డైరెక్టర్ అనుదీప్ కు ఘోర అవమానం..!
అలాగు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోది. అయితే‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నిధి, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్లో కీలకమైన రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

పవన్ కల్యాణ్ సరసన నటించిన ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు సినిమాల విజయం తన కెరీర్‌కు ఎంతో ముఖ్యమని భావిస్తున్న నిధి, వాటి సక్సెస్ కోసం ప్రత్యేకంగా ఈ పూజలు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..!
నిధి అగర్వాల్ వేణు స్వామిని సంప్రదించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన సలహాలు, సూచనలు పాటించిన తర్వాతే ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయని, కెరీర్ గాడిన పడిందని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ అదే సెంటిమెంట్‌తో సినిమా విడుదల ముందు పూజలు చేయించారని భావిస్తున్నారు.