వరదల బీభత్సం.. న్యూ మెక్సికో వరదల్లో కొట్టుకుపోయిన ఇల్లు, వైరల్ వీడియో.

వరదల బీభత్సం.. న్యూ మెక్సికో వరదల్లో కొట్టుకుపోయిన ఇల్లు, వైరల్ వీడియో.
ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం భయంకరమైన వరదను తెచ్చిపెట్టింది. కన్నుమూసేలోపు ఇండ్లకు ఇండ్లనే తుడిచిపెట్టింది. ఈ భయానక దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని చూసిన ప్రజలు షాక్‌కు గురయ్యారు.

అయితే గతేడాది కార్చిచ్చుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రియో రుయిడోసో నది ఒక్కసారిగా పోటెత్తింది. కేవలం గంట వ్యవధిలోనే నది నీటిమట్టం రికార్డు స్థాయిలో 20.24 అడుగులకు చేరిందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. దీంతో రుయిడోసో కౌంటీలో అధికారులు ‘ఫ్లాష్ ఫ్లడ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు.
Also Read: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా..!
నదీ పరివాహక ప్రాంతాల్లోని వారు తక్షణమే ఎత్తైన, సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారని రుయిడోసో మేయర్ లిన్ క్రాఫోర్డ్ తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా తీవ్ర గాయాలైనట్లు సమాచారం లేదని వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కౌంటీ అధికార ప్రతినిధి కెర్రీ గ్లాడెన్ వెల్లడించారు.
Also Read: శివుడు ఆలయాన్ని నిర్మించి భక్తులైన బ్రిటిష్ దంపతులు..!
వరదల కారణంగా డజన్ల కొద్దీ రోడ్లను మూసివేశామని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి, సురక్షితంగా ఉండాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.