9 నెలలుగా ఇంట్లోనే శవంగా పడి ఉన్న నటి. అంత్యక్రియలకు ముందుకురాని తండ్రి.

9 నెలలుగా ఇంట్లోనే శవంగా పడి ఉన్న నటి. అంత్యక్రియలకు ముందుకురాని తండ్రి.
లాహోర్‌కు చెందిన హుమైరా అస్గర్ అలీ 2015లో ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టెలివిజన్ షోలైన ‘జస్ట్ మ్యారీడ్’, ‘ఎహసాన్ ఫరమోష్’, ‘గురు’, ‘చల్ దిల్ మేరే’ వంటి షోలలో సహాయ పాత్రల్లో నటించింది. అయితే పాకిస్తానీ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ మరణించారు. 32 ఏళ్ల ఈ భామ మరణించిన మూడు వారాల తర్వాత ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. హుమైరా అస్గర్ అలీ గత కొన్ని సంవత్సరాలుగా కరాచీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తుంది. చాలా రోజులుగా ఆమె ఎవరికీ కనిపించలేదు.

ఈ క్రమంలో ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులకు ఆమె శవమైన కనిపించింది. కొన్ని నెలల నుంచి హుమైరా అద్దె చెల్లించడం లేదు. దీంతో విసుగు చెందిన ఓనర్ కోర్టుకు వెళ్లాడు. ఫ్లాట్‌ను చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు హుమైరా ఫ్లాట్‌కు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టారు. కానీ ఎవరు తలుపు తియ్యలేదు. చివరకు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా ఆమె శవమై కనిపించింది.
Also Read: 67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క..!
అన్నీ డోర్లు లాక్ చేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలను సేకరించింది. మృతదేహాం సైతం పూర్తిగా కుళ్లిపోయిందని.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాకే ఎలా మరణించిందనేది చెప్పగలమని పోలీసులు తెలిపారు. కాగా లాహోర్‌కు చెందిన హుమైరా 2015 ప్రాంతంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
Also Read: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా..!
ఆమె జస్ట్ మ్యారీడ్, ఎహ్సాన్ ఫరామోష్, గురు, చల్ దిల్ మేరే వంటి టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. 2015 యాక్షన్ థ్రిల్లర్ జలైబీ, లవ్ వ్యాక్సిన్ వంటి సినిమాల్లోను నటించింది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇలా హఠాత్తుగా హుమైరా మరణించడం పాక్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.