Plane Crash: ప్రమాదానికి కారణం అదేనా.? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.

Plane Crash: ప్రమాదానికి కారణం అదేనా.? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.
యూఎస్ విమానయాన న్యాయ సంస్థ మోట్లీ రైస్‌తో పనిచేసే న్యాయవాది మేరీ షియావో మాట్లాడుతూ, “రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అరుదైన సంఘటన” అని, అది కూడా బాహ్య కారణాలతోనే ఏర్పడుతుందని తెలిపారు. అంటే సాంకేతిక సమస్యలు ఏవి ఏర్పడ్డా ఒకేసారి రెండు ఇంజిన్లు విఫలం చెందడం అన్నది జరగదని, అత్యంత అరుదైన సందర్భంలోనే ఇలా జరుగుతుందని తెలిపాడు.

యితే టేకాఫైన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లయ్ ఆగిపోవడంతో రెండు ఇంజన్లూ పనిచేయడం మానేశాయి. ఎందుకు ఫ్యూయల్ కటాఫ్ చేశావ్ అని ఒక పైలట్ అడగ్గానే.. నేను కటాఫ్ చెయ్యలేదు అని రెండో పైలట్ చెప్పాడు. కాక్‌పిట్ ఆడియో రికార్డుల్లో ఈ వాయిస్ ఉంది. ఇంజిన్లు పవర్‌ను కోల్పోగానే.. ఆటోమేటిక్‌గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయ్యింది.
Also Read: 9 నెలలుగా ఇంట్లోనే శవంగా పడి ఉన్న నటి.
దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా AAIB దగ్గర ఉంది. వెంటనే ఇంజన్లను రీస్టార్ట్ చెయ్యడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంజన్1 రికవర్ అయినా ఇంజన్2 మొరాయించడంతో 32 సెకన్లలోనే విమానం కూలిపోయిందని నివేదిక తెలిపింది. విమానంలో ఫ్యూయల్ క్లీన్‌గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రిఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తేలింది. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలా లేదని, పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు కనిపించలేదని తెలిపింది. పైగా ఆకాశం క్లియర్‌గా ఉంది.
Also Read: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా..!
వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్‌కి అనువుగానే ఉన్నాయి. విమానంలో మోతాదుకు మించిన బరువులు కూడా ఏవీ లేవు. పైలట్లు ఇద్దరూ మంచి అనుభవుజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తడి లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని AAIB చెబుతోంది.