Health

ఈ మాత్రలు వాడుతున్నారా..? అయితే మీకు ప్రాణాంతక నరాల వ్యాధులు వస్తాయి.

నిద్ర మాత్రలు నిద్ర పట్టడానికి వాడే ఒకరకమైన ఔషధము.రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోయినా, ఏవైనా ఒత్తిళ్లతో సతమతమైపోతున్నా.. వెంటనే గుర్తొచ్చేది నిద్రమాత్ర. చాలామంది నిద్ర కోసం ఈ పద్ధతినే అనుసరిస్తుంటారు. అయితే ఆధునిక జీవనశైలిలో నిద్రలేమి, ఆందోళన అనేవి సాధారణ సమస్యలుగా మారాయి. ఈ సమస్యలను అధిగమించడానికి చాలామంది వైద్యుల సలహా లేకుండానే నిద్ర మాత్రలు, ఆందోళన నివారణ మందులు వాడుతుంటారు.

అయితే, ఇటీవల నిర్వహించిన ఓ షాకింగ్ అధ్యయనం ఈ మందుల వాడకానికి, ఒక ప్రాణాంతక నరాల వ్యాధికి మధ్య సంబంధం ఉందని వెల్లడించింది. ఇది ప్రజారోగ్య నిపుణులలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆందోళన, నిద్రలేమి సమస్యలకు వాడే కొన్ని రకాల మందులు పెరిఫెరల్ న్యూరోపతి అనే తీవ్రమైన నరాల వ్యాధికి కారణం కాగలవని ఈ అధ్యయనం సారాంశం. పెరిఫెరల్ న్యూరోపతి అంటే మెదడు, వెన్నుపాము వెలుపల ఉన్న నరాల వ్యవస్థకు నష్టం కలగడం.

Also Read: కాడేద్దులుగా మనవళ్ళుతో వ్యవసాయం చేస్తున్న అన్నదాత.

ఈ నరాలు చేతులు, కాళ్ళకు, ఇతర శరీర భాగాలకు సంకేతాలను పంపుతాయి. ఈ నరాలు దెబ్బతిన్నప్పుడు, తిమ్మిర్లు, మంట, నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో, ఇది తీవ్రమైన శారీరక అంగవైకల్యానికి దారితీస్తుంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో వ్యక్తుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. నిద్ర, ఆందోళనకు మందులు వాడుతున్న వారిలో పెరిఫెరల్ న్యూరోపతి వచ్చే ప్రమాదం గణనీయంగా అధికం అని గుర్తించారు.

Also Read: 9 నెలలుగా ఇంట్లోనే శవంగా పడి ఉన్న నటి.

మందుల మోతాదు, వాడిన సమయం పెరిగే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుందని అధ్యయనం తెలియజేసింది. ఈ పరిశోధన ప్రజలకు ఒక తీవ్రమైన హెచ్చరిక. నిద్రలేమి లేదా ఆందోళనతో బాధపడేవారు స్వీయ వైద్యం మానుకోవాలి. తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు సూచించిన చికిత్సా పద్ధతులను అనుసరించాలి. మందుల వాడకం అవసరమైతే, వాటి ప్రయోజనాలు, ప్రమాదాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

Also Read: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా..!

దీర్ఘకాలిక వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలి. జీవనశైలి మార్పులు, యోగా, ధ్యానం లాంటివి నిద్రలేమి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ అధ్యయనం వెలుగులో, నిద్ర, ఆందోళన మందుల వాడకం పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker