Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆస్తులు విలువ తెలుసా..? వారసులు ఎవరో తెలుసా..?

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆస్తులు విలువ తెలుసా..? వారసులు ఎవరో తెలుసా..?
Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు కంకిపాడు 1942, జులై 10న జన్మించారు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాస రావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన డాక్టర్. దీంతో తండ్రిలాగే డాక్టర్ కావాలని అనుకున్నారు కోట. కానీ నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల నటనవైపు అడుగులు వేశారు.

అయితే 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు తోనే ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించారు. కళామతల్లికి కోట అందించిన సేవలకు ప్రతీకగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. అలాగే ఆయన నటనా ప్రతిభకు ప్రతీకగా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ వేత్తగానూ కోట సత్తా చాటారు.
Also Read: కట శ్రీనివాసరావు 750 సినిమాలు చేసిన.. ఆ కోరిక ఇప్పటికి తీరలేదు.
1999- 2004 మధ్య కాలంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆ తర్వాత రాజకీయాలను పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ నటుడిగా స్థిర పడిపోయారు. ఇటీవల అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆయన ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. అయితే పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లులో కోట నటించారని తెలుస్తోంది. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు.
Also Read: రాజమౌళి కి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..?
1978 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన సుమారు 37 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్స్ సినిమాల్లో భాగమయ్యారు. సినిమాల్లో ఉన్నంత కాలం బిజీ ఆర్టిస్టుగా గడిపిన కోటకు ఆస్తులు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. శ్రీనివాసం పేరుతో ఫిల్మ్ నగర్ లో ఆయనకు ఒక పెద్ద ఇల్లు ఉంది. దీని మార్కెట్ వ్యాల్యూ కోట్లలోనే ఉంటుందని సమాచారం. ఇక కోట సినిమాల్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టారట.
Also Read: ప్రమాదానికి కారణం అదేనా.?
ఇప్పుడు వాటి విలువ కూడా పెరగడంతో ఆయన ఆస్తుల విలువ దాదాపు 80 కోట్లకు పై మాటే అని తెలుస్తోంది. కాగా కోట శ్రీనివాసరావుకు 1966లో రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. అయితే 2010 జూన్ 21న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోట ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇద్దరూ కూతుళ్లకు పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.