News

Nidhhi Agerwal: బోనాల ఉత్సవాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ చేసిన స్టార్ హీరోయిన్.

Nidhhi Agerwal: బోనాల ఉత్సవాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ చేసిన స్టార్ హీరోయిన్.

Nidhhi Agerwal: గ‌త కొన్నిరోజులుగా ఆమె ఈ మూవీ ప్రచార‌ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ హిస్టారికల్ మూవీ ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారంన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

ఏపీ, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మెగా ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలుస్తోంది. కాగా ఈ మూవీ కోసం చాలా కష్టపడుతోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఒక్కరోజులోనే ఆమె ఏకంగా15 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు సమాచారం.

Also Read: ఆగస్టు 1 నుండి యూపీఐలో కీలక మార్పులు.

ఒక్కో మీడియా సంస్థకూ సుమారు అరగంట పాటు టైమ్ కేటాయించిన నిధి సుమారు 8 గంటల పాటు నిరంతరాయంగా ఇంటర్వ్యూయర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. నిధి డెడికేషన్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హరి హర వీరమల్లు సినిమా సక్సెస్ కోసం గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది నిధి.

Also Read: విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించింది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు నిధి అగర్వాల్ ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంతకు ముందు విజయ వాడ ఇంద్రకీలాద్రి ఆలయంలోనూ నిధి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker