Python:ఇలా కూడా ఎక్కొచ్చా.. కొండచిలువ చెట్టు ఎలా ఎక్కుతుందో చుడండి, వైరల్ వీడియో.

Python:ఇలా కూడా ఎక్కొచ్చా.. కొండచిలువ చెట్టు ఎలా ఎక్కుతుందో చుడండి, వైరల్ వీడియో.
Python: భారీ పరిమాణం, బలమైన కండరాలతో ప్రసిద్ధి పొందిన కొండచిలువలు పెద్ద జంతువులను కూడా సులభంగా వేటాడగలవు. సాధారణంగా ఇవి వేటాడిన జంతువును జీర్ణం చేసుకునే సమయంలో చెట్టుకు చుట్టుకుని విశ్రాంతి తీసుకుంటాయని చెబుతారు. కానీ ఈసారి కొండచిలువ ఎవ్వరినీ వేటాడలేదు. కేవలం చెట్టెక్కుతున్న తీరు మాత్రం ఆశ్చర్యపరిచింది.

అయితే నిత్యం మనం నెట్టింట్లో పాముల వీడియోలు చాలానే చూస్తుంటాం.. రకరకాల పాములు సోషల్ మీడియా ద్వారా చూస్తుంటాం.. అన్నింటికన్నా పెద్దది భయంకరమైనది కొండచిలువే అని అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద జంతువులను సైతం సులభంగా తినెయగల సత్తా ఉంటుంది.
Also Read: ఆగస్టు 1 నుండి యూపీఐలో కీలక మార్పులు.
అయితే కొండచిలువ ఒక జంతువుని గానీ, మనిషిని గానీ తిన్నట్లయితే దాన్ని అరిగించుకునేందుకు చెట్టుకు చుట్టుకుని అరిగించుకుంటుందని చెబుతుంటారు. అయితే ఇక్కడ కొండచిలువ ఎవ్వరిని తినలేదు కానీ చెట్టెక్కుతూ కనిపించింది. ఈ పాము చెట్టును చుట్టుకుంటూ ఎలా ఎక్కుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు.
Also Read: ఇంట్లోకి వచ్చిన పామును పామును చేత్తో పట్టుకున్న సోనూసూద్.
ఈ చెట్టు ఎక్కుతున్న పాము వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. మాములుగా పాములు ముందుకు సాగుతూ చెట్లను ఎక్కుతాయి. అయితే కొండచిలువ మాత్రం చెట్టును చుట్టుకుంటు ఎక్కుతుంది. ఈ వీడియో చూడటానికి భయమేసినా ఆ పాము చెట్టు ఎక్కినా తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.