Health

Coriander Seed Water: ఈ ధనియాల నీరు రోజు తాగితే చాలు, బయటకి చెప్పలేని రోగాలన్నీ తగ్గిపోతాయి.

Coriander Seed Water: ఈ ధనియాల నీరు రోజు తాగితే చాలు, బయటకి చెప్పలేని రోగాలన్నీ తగ్గిపోతాయి.

Coriander Seed Water: ధనియాలని వాడడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అందుకే, ఆయుర్వేదంలోనూ అనేక సమస్యలకి మందుగా వాడతారు. ముఖ్యంగా, ఈ ధనియాలు నానబెట్టిన నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే ఎన్నో సమస్యలకి చెక్ పెట్టొచ్చు. అయితే ధనియాల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినాల్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది.

దీంతో కంటి సమస్యలు దూరమవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. ధనియాల నీటిలో విటమిన్​ ఎ, సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్​ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటిని పరగడుపునే తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

Also Read: పచ్చి బాదంపప్పు తింటున్నారా..?

ధనియాల నీటిలో చెడు కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసే లక్షణాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గట్ హెల్త్​కి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ సొంతమవుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. హెల్తీ గట్​ని ప్రమోట్ చేస్తుంది. మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ ధనియా నీటిలో ఉంటాయి. ఇవి బోన్స్ హెల్త్​ని ఇంప్రూవ్ చేస్తాయి.

Also Read: వర్షాకాలంలో డీహైడ్రేషన్‌ అయితే మీ ప్రాణాలకే ముప్పు.

పోషకాల లోపాలను భర్తీ చేస్తాయి. ధనియవాటర్ ఇలా క్రమం తప్పకుండా తాగితే థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి. 1 టేబుల్ స్పూన్ ధనియాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగటం వల్ల థైరాయిడ్ నియంత్రణలో సాయపడుతుంది. అలాగే, ఫ్రీ రాడికల్స్​ నుంచి శరీరాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి హెల్తీ స్కిన్​ని, మచ్చలు లేని చర్మాన్ని అందిస్తాయి.

Also Read: రోజూ పరగడుపున కిస్మిస్ నీళ్లు తాగితే చాలు.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు బరువు తగ్గే ప్రయత్నంలో ఈ ధనియాల నీరు తాగటం మంచి ఫలితాన్నిస్తుంది. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇది శరీరంలోని కొవ్వుని కాలుస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తాగితే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker