News

ఆధార్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్, UIDAI ఏం చెప్పిందో తెలుసుకోండి.

పాత రూల్‌లో ఆధార్ కార్డ్‌లో మీ చిరునామా, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే సౌకర్యం ఉంది. ఇతర అంశాలను అప్‌డేట్ చేయడానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలను స్వయంగా సందర్శించాల్సి ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో ఇప్పుడు చాలా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేయవచ్చు. భవిష్యత్తులో ఆన్ లైన్ లో కూడా మీ మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకునే సదుపాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగాయి. హ్యాకర్లు, మోసగాళ్లు ప్రజల డేటాను దొంగిలించి, బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బును ఖాళీ చేస్తున్నారు. లేదా బెదిరింపులకు దిగుతున్నారు.

కాల్‌, మెసేజ్‌, ఆన్‌లైన్‌ ఇలా అవకాశమున్న ప్రతి మార్గంలో ప్రజలను మోసగించి, డేటాను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో మన వ్యక్తిగత డేటాను కాపాడుకోవడం చాలా కీలకం. ఈ విషయం అర్థం చేసుకున్న యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(UIDAI), ఆధార్ కార్డ్ భద్రతను పెంచే ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అదే బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్. ఇది ఆధార్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ అంటే ఏంటి..? ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ అంటే.. మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మీ బయోమెట్రిక్ ఇన్‌ఫర్మేషన్‌ (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ల వంటివి)కు సేఫ్టీ లాక్ లాంటిది.

ఈ లాక్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత, మీ బయోమెట్రిక్ డేటాను యూజ్‌ చేసి ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయలేరు. మీ ప్రైవసీని రక్షించడానికి, బయోమెట్రిక్ ఇన్‌ఫర్మేషన్‌ దుర్వినియోగం కాకుండా చూసుకోవడానికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. ఏ డేటాను లాక్ చేయవచ్చు..?బయోమెట్రిక్ లాక్‌ను ఆన్ చేస్తే మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ డేటా కూడా లాక్‌ అవుతుంది. దీంతో ఆధార్ అథెంటికేషన్‌ కోసం ఈ వివరాలను ఉపయోగించలేరు. బయోమెట్రిక్స్ లాక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది..? ఈ ఫీచర్ ఆన్ చేస్తే బయోమెట్రిక్‌లను ఆధార్ అథెంటికేషన్‌ కోసం ఉపయోగించలేరు.

మీ సమ్మతి లేకుండా మీ బయోమెట్రిక్ డేటాను ఎవరూ ఉపయోగించకుండా ఇది అదనపు భద్రతను జోడిస్తుంది. లాక్ చేసినప్పుడు ఎవరైనా మీ బయోమెట్రిక్‌లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తే, ‘330’ అనే ఎర్రర్ కోడ్ కనిపిస్తుంది. బయోమెట్రిక్స్ సురక్షితంగా ఉన్నాయని, అథెంటికేషన్‌ జరగలేదని ఇది సూచిస్తుంది. ఫీచర్‌ను అన్‌లాక్ చేయడం లేదా డిసేబుల్ చేయడం ఎలా..? మీ బయోమెట్రిక్ లాక్‌ను అన్‌లాక్ చేయడం లేదా డిసేబుల్ చేయడం చాలా సులభం. ఇందుకు UIDAI వెబ్‌సైట్, ఆధార్ సేవా కేంద్రం, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా mAadhaar యాప్‌ ద్వారా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.

ఈ సర్వీస్‌ను ఉపయోగించడానికి మీ ఆధార్‌కి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉండాలి. మొబైల్ నంబర్ ఇంకా లింక్ చేయకపోతే, ముందు ఈ పని పూర్తి చేయాలి. ఈ ఫీచర్‌ను ఎవరు, ఎప్పుడు ఉపయోగించాలి..? రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ లింక్‌ చేసిన ఆధార్ కార్డ్ హోల్డర్ ఎవరైనా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. మీ బయోమెట్రిక్ డేటా ప్రైవసీ, సెక్యూరిటీ గురించి ఆందోళన చెందుతుంటే ఈ లేటెస్ట్‌ ఫీచర్‌ ఉపయోగకరంగా ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా మీ బయోమెట్రిక్‌లను లాక్ చేయవచ్చు, అవసరమైనప్పుడు మాత్రమే వాటిని అన్‌లాక్ చేయవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker