News

ఆధార్ కార్డుతో రూ.50 వేలు మీ సొంతం, ATM కార్డ్ మాదిరి వాడుకోవచ్చు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కీమ్స్ అందాలంటే.. ఈ కార్డు తప్పనిసరి. ఇక బ్యాంకు ఖాతా తెరవాలన్నా,క్రెడిట్ , డెబిట్ కార్డులు వంటివి పొందాలంటే ఆధార్ కార్డు అవసరం. అంతేకాక అనేక పనుల విషయంలో ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇప్పటికే ఆధార్ కార్డు దాదాపు అందరు పౌరుల వద్ద ఉంది. ఇక ఈ కార్డు అప్ డేట్ విషయంలో కేంద్రం తరచూ ఏదో ఓ కీలక సమాచారం అందిస్తుంది. తాజాగా ఆధార్ కార్డు అప్ డేట్ విషయంలో జరిగే అక్రమాలపై కేంద్రం సీరియస్ అయ్యింది.

అయితే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు లేదా మారుమూల పల్లెలలోని ప్రజలకు అంటే బ్యాంకింగ్ సేవలు సరిగా అందుబాటులోకి లేని ప్రాంతాల్లో నివసించే వారికి ఏఈపీఎస్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్‌ను ఏఈపీఎస్ అని పిలుస్తారు. అంటే ఆధార్ కార్డు ఉంటే.. అకౌంట్‌లోని డబ్బులను పొందొచ్చు. అయితే ఇలా డబ్బులు పొందాలంటే కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది మీ ఆధార్ నెంబర్‌తో అనుసంధానం అయ్యి ఉండాలి. అప్పుడే ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్‌కు వెళ్లకుండానే డబ్బులు ఇంటి వద్ద నుంచే పొందొచ్చు.

పలు బ్యాంకులు బ్యాంక్ మిత్రాల ద్వారా ఈ సేవలను అందిస్తున్నాయి. ఇంకా కొన్ని బ్యాంకులు అయితే నేరుగానే ఈ సేవలు అందిస్తున్నాయి. అందువల్ల మీరు సులభంగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డబ్బులు ఎలా పొందాలో, ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చొ తెలుసుకుందాం. ఫినో సహా పలు పేమెంట్స్ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. మీకు దగ్గరిలో లేదా మీ ఊరిలో ఎవరైనా ఇలా బ్యాంక్ మిత్రాలుగా పని చూస్తూ ఉంటే.. మీరు వారి వద్దకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఆధార్ నెంబర్ గుర్తుకు ఉంటే సరిపోతుంది. మీరు సులభంగా అకౌంట్‌లో డబ్బులు పొందొచ్చు. ముందుగా మీరు బ్యాంక్ పేరు, ఆధార్ నెంబర్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ఆధార్‌తో లింక్ అయిన అకౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఎంత మొత్తం విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ బయోమెట్రిక్స్ అందించాలి. అంటే వేలి ముద్రలు ఇవ్వాలి. బయోమెట్రిక్ సక్సెస్ అయితే అప్పుడు మీ అకౌంట్‌లోని డబ్బులు బ్యాంక్ మిత్ర అకౌంట్లోకి వెళ్తాయి.

ఆ డబ్బులు బ్యాంక్ మిత్ర మీ చేతికి ఇస్తారు. ఇలా మీరు బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే డబ్బులు పొందొచ్చు. అయిత ఇక్కడ రోజుకు రూ.10 వేలు వరకే తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఆధార్ ద్వారా ఏఈపీఎస్ విధానంలో మీరు నెలకు రూ. 50 వేల వరకు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్‌లో ఎంత మొత్తం ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు సులభంగానే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండా ఈ సేవలు పొందొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker