News

కౌజు పిట్ట మాంసం తింటున్నారా..? అయితే మీరు ఎంత ప్రమదంలో ఉన్నారో తెలుసుకోండి.

దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు కౌజు పిట్టల మాంసంతో ఆరగించినట్టయితే ఆ వ్యాధి బారినపడుతారు. ముఖ్యంగా, ఊపిరి తిత్తులు బాగా పని చేస్తాయి. క్షయ వ్యాధికి కూడా కౌజు పిట్ట మాసం ఎంతో మంచింది. ప్రాణాంతకమైన గుండె జబ్బులు హైబీపీ, ఆర్థరైటిస్, హార్ట్ అటాక్, కేన్సర్, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పిట్ట మాంసంతో అలెర్జీలకు చెక్ పెట్టొచ్చు. అయితే భారతీయులు కోడి, బాతు, టర్కీ కోడి, ఇతర పక్షుల మాంసం తింటారు. వీటిలో దేని టేస్ట్ దానికే ఉంటుంది. అయితే ఈమధ్య కౌజు పిట్టల మాంసానికి కూడా డిమాండ్ పెరిగింది. వీటిని ఫారాల్లో పెంచుతూ, మాంసం అమ్ముతున్నారు.

కౌజు పిట్ట మన దేశంలో, అలాగే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే ఈ పక్షులలో ఒక జాతి చాలా విషపూరితమైనది. ఆ జాతిని కామన్ క్వాయిల్ అంటారు. దీని మాంసం తినడం చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కామన్ క్వాయిల్ జాతి కౌజు పిట్ట, నేలపై నివసించే ఒక రకమైన అడవి పక్షి. ఇవి ఎక్కువ దూరం ఎగరలేవు, గూళ్లలో నివసిస్తాయి. వీటి మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని వేటాడతారు. ఇవి యూరప్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా అంతటా కనిపిస్తాయి.

అయితే ఈ చిన్న పక్షి మాంసం విషపూరితమైనది, హానికరమైనది. ఎందుకు ప్రమాదం? సాధారణంగా “కోటర్నిక్స్ కోటర్నిక్స్” అనే ఉపజాతి పిట్టల మాంసం మానవులకు తీవ్ర హానిచేస్తుంది. వీటిలో కామన్ క్వాయిల్ ఒకటి. ఇవి శీతాకాలపు వలస సమయంలో కొన్ని విషపూరితమైన మొక్కలను తింటాయి. ఈ విషం పక్షుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వాటి మాంసం తింటే, మానవులు అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఆ వ్యాధుల ముప్పు ఎక్కువ.. కామన్ క్వాయిల్ పిట్టల మాంసంలో ఉండే విషం వల్ల రాబ్డోమియోలిసిస్ అనే మజిల్ ఇంజురీ రిస్క్ పెరుగుతుంది.

దీనివల్ల కండరాలు క్షీణించడంతో పాటు కొన్నిసార్లు చనిపోవచ్చు కూడా. ఈ వ్యాధి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. రాబ్డోమియోలిసిస్ వచ్చిన వారిలో కొన్నిసార్లు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. కొన్ని రోజుల క్రితం, 12 ఏళ్ల బాలుడు విషం కలిగిన కామన్ క్వాయిల్ జాతి కౌజు పిట్ట మాంసం తిని అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరాడు. డాక్టర్లు అతడికి 8 రోజులు ఐసీయూలో ట్రీట్‌మెంట్ చేసి కాపాడారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..కౌజు పిట్టలను వలస సమయంలో వేటాడకూడదని, ఆ సీజన్‌లో వాటి మాంసం తినకూడదని పరిశోధకులు చెబుతున్నారు. ఆ పిట్టల లివర్, ఇతర అవయవాలు వండకూడదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వాటి కాలేయంలో విషం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పిట్టల మాంసాన్ని బాగా ఉడికించాలి. అప్పుడే వేడి, విషాన్ని చంపేయగలదు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి విషం శరీరంలోకి ప్రవేశించవచ్చు. అందుకే దీనిని పూర్తిగా తినడం మానేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker