Actor: ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్, ఇప్పుడు వాచ్‌మన్‌గా మరి సహాయం కోసం ఎదురుచూపులు.

Actor: ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్, ఇప్పుడు వాచ్‌మన్‌గా మరి సహాయం కోసం ఎదురుచూపులు.
Actor: స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. సినిమాల్లో సహాయ పాత్రలలో నటించిన కొందరు జనాలకు మరింత దగ్గరవుతుంటారు. కానీ అదృష్టం సరిగ్గా ఉన్నంతవరకే ఏ స్టార్ డమ్ అయినా… గుర్తింపు అయినా. ఒక్కసారి పరిస్థితి మారితే జీవితాలు తలకిందులు అయిపోతాయి. అయితే సావి సిద్ధు.. లక్నోకు చెందిన అతడు మోడలింగ్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.

లా చదువుతూనే అటు యాక్టింగ్ స్కిల్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు. 1995లో తకాత్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాడు. చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ అతని నటనను గమనించి పాంచ్ కోసం సంప్రదించాడు. ఈ సినిమా విడుదల కాకపోయిన అతడి యాక్టింగ్ కశ్యప్ కు తెగ నచ్చేసింది. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, గులాల్, పాటియాలా హౌస్, డేడి, బెవకూఫియాన్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read: విశాల్-సాయి ధన్సికల పెళ్లి వాయిదా..!
అతడు చివరగా బెవకూఫియాన్ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు ఐదేళ్లకు అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలాలో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కనిపించాడు. అతడిని గుర్తుపట్టిన కొందరు సినీ పరిశ్రమ వ్యక్తులు అతడు సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: ఇంట్లోకి వచ్చిన పామును పామును చేత్తో పట్టుకున్న సోనూసూద్.
తన భార్యను కోల్పోయిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా మరణించారని.. ఆ తర్వాత తన అత్తమామలు కూడా చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయానని.. ఇప్పుడు తాను ఒంటరిగానే ఉంటున్నానని తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులు తనను మరింత కృంగిపోయేలా చేశాయని.. అందుకే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నానని అన్నాడు.