News

బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ నటి దారుణ హత్య, హంతకుడు ఎవరో తెలుసా..?

నటి విద్యను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. మైసూర్‌లోని తన ఇంట్లో ఈ దారుణ ఘటన జరిగింది. హత్య అనంతరం ఆమె భర్త నందీష్ పరార్‌ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా నటి విద్య, నందీష్‌ని 2018లో వివాహం చేసుకుంది. వివాహనంతరం కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ ఈ జంట గొడవపడుతుండేది. దీంతో విద్య భర్త నందీష్‌ విడాకులు తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. అయితే మైసూర్ సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ విద్యా నందీష్ హత్యకు గురి కావడం కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతుంది.

విద్యను ఆమె భర్త నందీషే హత్య చేసినట్లు తేలింది. ఆమె చిరంజీవి సర్జా నటించిన ‘అజిత్’ సినిమాలో హీరో స్నేహితురాలిగా నటించింది విద్య. విద్యకు బన్నూరు సమీపంలోని తురగనూరుకు చెందిన సామాజిక కార్యకర్త నందీష్‌తో 2018లో ఆమెకు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, విద్యానందీష్ తన భర్త, పిల్లలతో కలిసి మైసూర్‌లోని శ్రీరాంపూర్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల విద్య కాంగ్రెస్ పార్టీలో చేరింది. అప్పటి నుండి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటుంది ఆమె. అయితే ఇటీవల భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

పార్టీలో కొంత మంది నేతలతో సన్నిహితంగా మెలుగుతుందని, అది భర్త తట్టుకోలేకపోతున్నాడని సమాచారం. ఈ విషయంపైనే భార్యా భర్తల మధ్య గొడవలు జరిగి.. హత్యకు దారి తీసిందని స్థానికంగా చర్చనడుస్తోంది. సోమవారం రాత్రి విద్య తన భర్తతో ఫోన్‌లో గొడవ పడింది. దాంతో విద్య రాత్రికి మైసూర్ నుంచి బయలుదేరి తన భర్త ఇల్లు ఉన్న తుర్గనూర్ వెళ్లింది. అక్కడకు వెళ్లాక ఆ తగాదా మరింత పెద్దదైంది. ఆ ఆవేశంలో పదునైన ఆయుధంతో భార్య తలపై కొట్టి పారిపోయాడు నందీష్. మంగళవారం ఉదయం రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. నటి, కాంగ్రెస్ నాయకురాలు హత్య గురికావడంతో అటు పొలిటికల్, ఇటు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. నిందితుడు నందీష్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. విద్యా భజరంగీతో పాటు వజ్రకాయ, వేద, జై మారుతి 800 వంటి చిత్రాల్లో కూడా నటించింది. పార్టీలో జనరల్ సెక్రటరీ స్థాయికి వెళ్లిన విద్య.. అంతలోనే ఆమె హత్యకు గురైంది. కాంగ్రెస్ నేతలు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker