వందల కోట్లున్నా.. సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కుంటున్న స్టార్ హీరో కొడుకు, ఎందుకో తెలుసా..?
సినీ, రాజకీయ ప్రముఖులకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినిమా హీరోలు అనగానే ఖరీదైన వాచ్ లు, ఖరీదైన కార్లు వాడుతుంటారు. కొందరు హీరోలు మాత్రం తమ వద్ద కోట్ల ఆస్తులు ఉన్నా సరే.. సాదాసీదా జీవితమే గడుపుతుంటారు. అలానే స్టార్ హీరోల పిల్లలు అయితే వీరికి పూర్తి భిన్నంగా ఉంటారు. కొందరి పిల్లలైతే చెడు వ్యసనాలకు బానిసై రకరకాల పనులు చేస్తూ మీడియా, పోలీసులకు చిక్కిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
అయితే బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. సినిమా ఫలితం ఎలా ఉన్నాసరే తాను మాత్రం తన పని చేసుకుంటూ పోతాడు. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్టింగ్ చేస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్న అక్షయ్ కుమార్ పాల్గొన్నాడు. ఆ షోలో భాగంగా తన కొడుకు ఆరవ్ గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాన్ని బయటపెట్టాడు. అది విన్న అందరూ స్టార్ హీరో కొడుకు అలా చేస్తున్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
తన భార్య ట్వింకిల్, తాను కలిసి ఆరవ్ ని చాలా పద్దతిగా పెంచామని అక్షయ్ వెళ్లడించారు. చాలా సాధారణ అబ్బాయిలా తన కుమారుడ్ని పెంచామని, ఎప్పుడూ అది చెయ్ ఇది చెయ్ అని తాము బలవంతపెట్టలేదన్నారు. తనకి ఏం నచ్చితే అది చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఆరవ్‌కి నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదన్నారు. తాను 14 ఏళ్లకే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే.. ఆరవ్ 15 ఏళ్లకే చదువుకోవడానికి లండన్ వెళ్లాడని తెలిపారు.
ఆరవ్ వెళ్తుండా తాము అడ్డు చెప్పలేదని గుర్తు చేసుకున్నారు. ఆరవ్ తనకి సంబంధించిన అన్ని పనులను తానే స్వయంగా చేసుకుంటాడని.. డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు ఎప్పుడూ ప్రవర్తించడని షోలో వెల్లడించారు. ఆరవ్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే.. వాటిని వేస్ట్ చేయకుండా థ్రిప్టీ అనే సెకండ్ హ్యాండిల్ బట్టలమ్మే షాప్‌కి వెళ్లి తనకి కావాల్సినవి కొనుక్కుంటాడని అక్షయ్ కుమార్ అన్నారు. డబ్బు విలువ తెలిసిన వాడిగా, మధ్యతరగతి నుంచి ఎదిగిన వాడిలా విలువలకు కట్టుబడి ఉంటాడన్నారు.