Health

చలికాలంలో ఈ ఆకుకూరలు తింటే జలుబు, దగ్గు, జ్వరం రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది.

ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకు కూరలు ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా.. సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చలికాలంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ఎందుకంటే ఏ కొంచెం అజాగ్రత్త కూడా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సీజన్‌లో సూర్యరశ్మి లేకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడి రక్తకణాలు సన్నగిల్లుతాయి. దీనివల్ల రక్తప్రసరణ సక్రమంగా జరగదని, అందుకే ఆకుకూరలు తినాలని సూచిస్తున్నారు వైద్యులు. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరాన్ని తరిమికొట్టే ఆకుకూరలు తీసుకోవటం వల్ల అవి మీ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. ఆకుకూరల్లో రకరకాల పోషకాలు, సమ్మేళనాలు ఉంటాయి. ఆకుకూరలు శరీరం, మనస్సు పోషణకు మేలు చేస్తాయి.

ఔషధ గుణాల కారణంగా, ఈ కూరగాయలు చాలా వరకు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. మీరు అజీర్ణం, చర్మ సమస్యలు, ఇతర సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి వ్యాధులను త్వరగా నయం చేయడంతోపాటు రక్షణగా కూడా పనిచేస్తాయి. ఆవ కూర… ఆవ కూరలో కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, చక్కెర, పొటాషియం, విటమిన్ ఎ, సి, డి, బి12, మెగ్నీషియం, ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆవకూర శరీరంలోని విష పదార్థాలను తొలగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

మెంతి ఆకుకూర.. చలికాలం రాగానే కూరగాయల మార్కెట్‌లో మెంతికూర విరివిగా దర్శనమిస్తుంది. మెంతికూరలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, నియాసిన్, పొటాషియం, ఐరన్ ఉన్నాయి. మెంతి ఆకుకూరల్లో శరీరానికి చాలా ముఖ్యమైన ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, సోడియం, జింక్, కాపర్ మొదలైనవి కూడా ఉంటాయి. మెంతులు పొట్టకు చాలా మేలు చేస్తాయి. ఎర్రతోట కూర.. ఎర్రతోట కూరలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ ఎ, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.

ప్రతిరోజూ ఎర్రతోటను తినడం ద్వారా శరీరంలో విటమిన్ లోపం భర్తీ చేయబడుతుంది. బతువా ఆకుకూరలు.. బతువా ఆకుకూరల్లో చాలా పోషకాలు లభిస్తాయి. విటమిన్ B2, B3, B5, విటమిన్-C, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం బతువాలో తగినంత పరిమాణంలో లభిస్తాయి. ఇది కాకుండా, బతువాలో తగినంత ఖనిజాలు కూడా ఉన్నాయి. చలికాలంలో బతువా ఆకుకూరలు తీసుకోవడం వల్ల మాంసం కంటే ఎక్కువ ప్రొటీన్లు లభిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker