Health

ఈ కాలంలో హై బీపీ ఉన్న వారు ఈ తప్పులు చేయకూడదు. ఎందుకంటే..?

ఆధిక రక్తపోటు ఉన్నవారిలో 80% మందికి సరైన చికిత్స అందడం లేదు. దేశాలు ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్ చేయగలిగితే, 2023 – 2050 మధ్య కాలంలో 7.6 కోట్ల మరణాలను నివారించవచ్చు. ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్స్ బాగా ఉన్న దేశాల్లో 7.6 కోట్ల మరణాలు, 12 కోట్ల స్ట్రోక్‌లు, 7.9 కోట్ల గుండెపోటులు, 1.7 కోట్ల గుండె వైఫల్యం కేసులను ఇప్పుడు, 2050 మధ్య నిరోధించవచ్చు. అయితే సీజన్ మారినప్పుడు తొలుత జలుబు, దగ్గు సమస్య మొదలవుతుంది.

వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభించడం మూలంగా అనేక వ్యాధులు దాడి చేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు. చలికాలంలో రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు లక్షణాలు వేసవిలో కనిపించినా అంతగా ప్రమాదం ఉండదు. కానీ చలిలో అలా కాదు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. చలికాలంలో అధిక రక్తపోటు ముప్పు రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ సీజన్‌లో చిన్న చిన్న జీవనశైలి మార్పులు అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి. బరువు తగ్గేందుకు చాలామంది జిమ్‌కు వెళ్తుంటారు. చలికాలంలో అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే వ్యాయామం తప్పనిసరి. చలికాలంలో ఎంత ఎక్కువ చక్కెర, ఉప్పు, కేలరీలు తీసుకుంటే రక్తపోటు అంత ఎక్కువ ఉంటుంది.

ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, సాల్టీ ఫుడ్ తినడం వల్ల హైబీపీ రిస్క్ పెరుగుతుంది. బయటి ఆహారం తినకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తినవచ్చు. శీతాకాలపు కూరగాయలను తినడం వల్ల కూడా రక్తపోటు ప్రమాదాన్ని నివారించవచ్చు. చలికాలంలో తక్కువగా నీళ్లు తాగుతుంటారు. చల్లని వాతావరణంలో అధికంగా దాహంగా అనిపించదు.

ఈ పొరపాటు శరీరం నిర్జలీకరణానికి కారణమవుతుంది. దీంతో రక్త నాళాలను సంకోచించడం ప్రారంభమవుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఈ కాలంలో దాహం వేయకపోయినా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker