News

ఇండస్ట్రీలోకి వచ్చి అల్లు అర్జున్ ఏన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడో తెలుసా..?

అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరు ఆసక్తిగా పాల్గొనే వారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. అయితే అల్లు అర్జున్ 1985లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2003లో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘గంగోత్రి’. ఆ తర్వాత అల్లు అల్లున్ వరుస సినిమాల్లో నటించాడు.

కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. ‘ఆర్య,’ ‘దేశముదురు,’ ‘పరుగు,’ ‘జులాయి,’ ‘రేసు గుర్రం,’ ‘సరైనోడు,’ ‘అల వైకుంఠపురములు’, ‘పుష్ప: ది రైస్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీగా హిట్‌ అయ్యాయి. పుష్ప స్టార్ అల్లు అర్జున్ కి కాస్త లగ్జరీ కార్ క్రేజ్ ఉంది. బన్నీ గ్యారేజీలో అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి రేంజ్ రోవర్ వోగ్, దీని ధర దాదాపు రూ. 2.5-4 కోట్లు. మరో హమ్మర్ హెచ్2 ధర దాదాపు రూ.75 లక్షలు. ఉంది అల్లు అర్జున్ వద్ద జాగ్వార్ ఎక్స్‌జెఎల్ , వోల్వో ఎక్స్‌సి 90 టి8 ఎక్సలెన్స్ వంటి కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. అతని గ్యారేజీ నిండా ఖరీదైన కార్లు ఉన్నాయి. అర్జున్‌కి కార్లే కాదు, ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

అతను తన కుటుంబంతో కలిసి జెట్ ‌లో ట్రిప్‌లకు వెళ్తాడు. టాలీవుడ్ ఇండస్ట్రీల్లో రిచ్ స్టార్లలో అల్లు అర్జున్ ఒకరు. అల్ట్రా విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. బ్లెస్సింగ్ అనే అల్లు బంగ్లా హైదరాబాద్‌లోని అత్యంత పాష్ ఏరియాలలో ఒకటైన జూబ్లీహిల్స్‌లో ఉంది. ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసిస్తున్నారు. 2 ఎకరాల స్థలంలో అల్లు అర్జున్ ఇల్లు కట్టారు. 100 కోట్లకు కొనుగోలు చేశారు. వారి ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్, బార్ జోన్, పిల్లల కోసం ప్లేగ్రౌండ్ కూడా ఉన్నాయి. నటీనటులకు, వానిటీ వ్యాన్ వారి రెండవ ఇల్లు.

అతను సినిమా షూటింగ్‌ల కోసం బయటికి వెళితే, ఎక్కువ సమయం తన వ్యాన్‌లోనే గడుపుతాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఉంది. దీని ధర 7 కోట్లు ఉంటుందని సమాచారం. విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్‌లో హైటెక్ రూం, వినోదం కోసం స్మార్ట్ టీవీ, సౌకర్యవంతమైన రిక్లైనర్, జిమ్, రిఫ్రిజిరేటర్ . హైటెక్ బాత్రూమ్ వంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఈ వ్యాన్ ఏ ఫై స్టార్ హోటల్ కంటే తక్కువ కాదు. అల్లు అర్జున్‌కి ఖరీదైన వాచీలంటే చాలా ఇష్టం. అతని వద్ద అద్భుతమైన లగ్జరీ వాచ్‌ల కలెక్షన్ కూడా ఉంది.

బన్నీ కార్టియర్ శాంటాస్ 100 XL, హబ్లోట్ బ్యాంగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్ వాచ్ ధరించి కనిపించాడు. అతను రోలెక్స్ డేటోనా స్టెయిన్‌లెస్ స్టీల్ వాచ్ ధరించి కూడా ఒకసారి మెరిశాడు. ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ కోసం అల్లు అర్జున్ 50 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడు. పుష్ప: రూల్ కోసం 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని అంటున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ నికర ఆస్తుల విలువ 430 కోట్లు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అల్లు అర్హ, అల్లు అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker