ఇప్పుడు హీరో విజయ్ సేతుపతి కూతురు ఎలా ఉందో చూసారా..?
విజయ్ సేతుపతి.. 2003లో కేరళకు చెందిన జెస్సీని విజయ్ సేతుపతి వివాహం చేసుకోగా..వీరికి ఓ కుమారుడు,కుమార్తె ఉన్నారు. అయితే విజయ్ సేతుపతి కూతురు శ్రీజ గురించి ఎక్కువమందికి తెలియదు.తాజాగా శ్రీజ తన తండ్రి విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఇండస్ట్రీలో గుర్తింపు దక్కక ముందే విజయ్ సేతుపతికి జెస్సీ అనే అమ్మాయితో వివాహం అయింది. 2003 లో వీరి వివాహం జరిగింది.
విజయ్ సేతుపతి మరియు జెస్సీ కి సూర్య, శ్రీజ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ ఇద్దరు కూడా ఇప్పటికే వెండి తెరపై కనిపించారు, ఆ సమయంలో వారు విజయ్ సేతుపతి పిల్లలు అనే విషయం ప్రకటించలేదు. నేను రౌడీనే అనే సినిమాలో అబ్బాయి సూర్య చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇక విజయ్ సేతుపతి 2020 సంవత్సరంలో నటించిన ముగిల్ సినిమా లో శ్రీజ కీలక పాత్రలో కనిపించింది.
నిజ జీవిత తండ్రి కూతురు అయిన వీరు సినిమాలో కూడా అలాగే కనిపించారు. ఆ సమయంలో శ్రీజ గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆ సమయంలో విజయ్ సేతుపతి కూతురు అనే విషయం కొద్ది మందికి మాత్రమే రివీల్ చేయడం జరిగింది. విజయ్ సేతుపతి విలక్షణ నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు.
అందుకే ఆయన పిల్లలు ఇద్దరు కూడా తప్పకుండా నటనతో గుర్తింపు దక్కించుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తప్పకుండా శ్రీజ త్వరలోనే నటిగా ఎంట్రీ ఇవ్వాలని, హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నాం అంటూ చాలా మంది ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు.