News

పెళ్లికి కొన్నిరోజుల ముందే సన్నీలియోన్ ని దారుణంగా మోసం చేసిన ఆ వ్యక్తీ ఎవరో తెలుసా..?

తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. ఆమె చివరగా నటించిన తెలుగు సినిమా జిన్నా. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది సన్నీలియోన్. స్పెషల్ సాంగ్స్ కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అయితే త‌న జీవితంలో వంచ‌న‌ల గురించి ప‌లుమార్లు బ‌హిరంగంగా మాట్లాడిన స‌న్నీలియోన్ ఇప్పుడు మ‌రోసారి ఎమోష‌న‌ల్ గా ఔట్ బ‌ర‌స్ట్ అయింది. తనూజ్ విర్వానీతో ఎక్స్‌స్క్వీజ్ మీ ప్లీజ్ అనే డేటింగ్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్న‌ సన్నీ లియోన్,

తన మాజీ భాగస్వామి తనను మోసం చేశాడని రియాలిటీ షో తాజా ఎపిసోడ్‌లో తెలియ‌జేసారు. ఒక‌ వ్యక్తితో తనకు నిశ్చితార్థం జరిగిందని, పెళ్లికి ఇంకెంతో స‌మ‌యం లేద‌ని, కానీ ఇంత‌లోనే ఊహించ‌నిది జ‌రిగింద‌ని స‌న్నీ వెల్లడించింది. రెండు నెలలపాటు ఎంతో స‌న్నిహితంగా ఉన్న అత‌డు త‌న‌ను ప్రేమించడం లేదని చెప్పాడు. అలా సన్నీకి చెప్పినప్పుడు గుండె బ‌ద్ధ‌లైంద‌ని స‌న్నీ తెలిపింది. నిశ్చితార్థం అయ్యాక‌ ద్రోహాన్ని స‌న్నీ త‌ట్టుకోలేక‌పోయింది. కానీ కాలంతో పాటు అన్నిటినీ అధిగమించి ఎదిగేందుకు ప్ర‌య‌త్నించింది స‌న్నీ.

తాజాగా రియాలిటీ ఎపిసోడ్‌లో బ‌హిరంగంగా నేను నా ప్ర‌స్తుత‌ భర్త డేనియ‌ల్‌ను కలవడానికి ముందు ఒక‌రితో నిశ్చితార్థం చేసుకున్నాను. ఏదో తప్పు జరిగిందని అనిపించింది. అతడు నన్ను మోసం చేస్తున్నాడు! నన్ను ప్రేమిస్తున్నావా? అని నేను అతనిని అడిగాను. లేదు, నేను ఇకపై నిన్ను ప్రేమించను! అని అన్నాడు. ఆ ఘ‌ట‌న స‌న్నీని తీవ్రంగా నిరాప‌రిచింది. ఆ త‌ర్వాత‌ చివరికి డేనియల్ వెబర్ ని పెళ్లాడింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు.. కుమార్తె నిషాతో పాటు ఒక జంట కవలలు నోహ్, ఆషెర్ ఉన్నారు.

హ‌వాయిలో మా పెళ్లికి నెలరోజుల ముందు.. డెస్టినేషన్ వెడ్డింగ్.. డ్రెస్ అన్నీ రెడీ అయ్యాయి.. ఎంచక్కా అన్నీ పూర్తయ్యాయి… కానీ ఇంత‌లోనే అంతా మారిపోయింది. ఇది ఎప్పటికి అత్యంత చెత్త అనుభూతి. కానీ అప్పుడు దేవుడు అద్భుతమైన పనులు చేసాడు. ఒక దేవదూతను పంపాడు. మా అమ్మ చనిపోయినప్పుడు, మా నాన్న చనిపోయినప్పుడు అక్కడ ఉన్న నా ప్రస్తుత భర్త అప్పటి నుండి నాతో ఉన్నాడు.. అని స‌న్నీలియోన్ తెలిపింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker