దేశంలోనే ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్న IAS అధికారి, ఇతని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
భారత ప్రభుత్వం రాష్ట్ర , కేంద్ర స్థాయిలలో వివిధ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అయితే.. పేరుకు ప్రభుత్వ ఉద్యోగం అయినా.. వారికి చెల్లించే జీతం, కేడర్ లో ఎక్కువ వ్యాత్యాసం ఉంటుంది. కేడర్ ను బట్టి.. వారికి చెల్లించే జీతం మారుతుంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. ఇతర ఉద్యోగ ఏజెన్సీ సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. స్వతంత్ర సంస్థలు అయితే ఎలాంటి పరీక్షను నిర్వహించకుండా.. కేవలం ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇలానే ఉంటుంది. అయితే అమిత్ కటారియా భారతదేశంలోని అత్యంత ధనిక బ్యూరోక్రాట్లలో ఒకరు. 1 రూపాయి జీతం తీసుకునే IAS అధికారిగా ప్రసిద్ధి చెందాడు. అతని కుటుంబం గుర్గావ్‌లో నిర్మాణ కంపెనీలను కలిగి ఉంది. అలాగే ఇది కాకుండా అతని భార్య బాగా సంపాదిస్తున్న ఒక ప్రొఫెషనల్ పైలట్.
తన జీవితాన్ని నడపడానికి సరిపడా ఆస్తులు ఉన్నాయని, జీతం ఏమిటని ప్రశ్నించగా.. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఐఏఎస్‌లో చేరానని, సంపాదించేందుకు కాదని చెప్పాడు. ఇప్పటికీ దేశానికి నిజాయితీగా సేవలందిస్తున్న అతికొద్ది మంది నిజాయితీ గల అధికారులలో ఆయన ఒకరు. జూలై 2023 నాటికి కటారియా ఆస్తుల విలువ రూ. 8.80 కోట్లు. అలాగే ఈ ఆస్తి ద్వారా అతని వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు.
టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్స్‌లు మినహా ఐఏఎస్ అధికారులు నెలకు రూ.56,100 ప్రారంభ వేతనం పొందుతారు. క్యాబినెట్ సెక్రటరీకి, ఈ జీతం నెలకు రూ. 2,50,000 వరకు చేరవచ్చు. ఇది ఐఏఎస్ అధికారికి అత్యున్నత పదవి. ఐఏఎస్ అధికారులు గ్రేడ్ పే అని పిలువబడే అదనపు చెల్లింపును కూడా అందుకుంటారు. ఇది వారి పోస్ట్‌ను బట్టి మారుతుంది.