News

Ugadi : ఉగాది రోజున ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయి.

ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది అంటే.. ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉగాది రోజు ఖచ్చితంగా కొన్ని రకాల పనులు చేయాలట. దీని వల్ల ఏడాదంతా శుభంగా ఉంటుందని పెద్దలు, పురాణాలు చెబుతాయి.

అయితే ఉగాది తెలుగు వాళ్ల తొలి పండుగ.. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈరోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈరోజును తెలుగు సంవత్సరంగా జరుపుకోవడం మాత్రమే కాదు. ఉగాది పచ్చడిని కూడా చేసుకుంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది.

చైత్రమాసం ప్రారంభమయ్యే రోజు ఇదే..ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది.. ఏప్రిల్ 9 న ఈ పండుగను జరుపుకుంటారు.. ఈరోజును చాలా పవిత్రంగా భావిస్తారు.. ఈరోజున ఎం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈరోజున ఉదయం లేచి స్నానం చేసి,గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, రంగులు ముగ్గులు వేసి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించాలి. శివుడికి రుద్రాభిషేకం చేయాలి.

విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, లేదా విష్ణుమూర్తి సహస్రనామాలను పటించాలి.. ఈరోజున దేవుళ్లను పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఉగాది పచ్చడితోపాటు పాలతో చేసిన పదార్థాలను దేవుళ్లకు నైవేద్యంగా పెట్టాలి. పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి.. అలాగే ఈరోజు నుంచి మన జాతకం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఉగాది శ్రవణం వినాలి.. జాతకంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము వంటివి తెలుసుకొని ముందుకు సాగాలి..అప్పుడే జీవితం సాఫిగా సాగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker