News

అల్లుడితో లేచిపోయిన అత్త, అత్త పక్కా ప్లాన్ చేయడంలో..?

అత్త ఆశాదేవి తరుచూ కూతురు ఇంటికి వస్తుండేది. దీంతో అత్తా, అల్లుడి మధ్య ప్రేమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. సూరజ్‌కు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆశాదేవి పలుమార్లు వచ్చింది. ఆ తర్వాత అత్తా అల్లుడు వెళ్లిపోయారు. పూర్తీ వివరాలోకి వెళ్తే ఈ ఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది. విదేశాల్లో ఉంటున్న అల్లుడు తన భార్యను వెంటపెట్టుకొని అత్తారింటికి వచ్చాడు. అతనికి ముగ్గురు పిల్లలున్నారు. వారు విదేశాల్లోనే ఉన్నారు. అల్లుడితో లేచిపోవాలనుకున్న అత్త పక్కా ప్లాన్ వేసింది.

వంటగది నుంచే ప్లాన్ అమలుచేసింది. అల్లుడితో ఆమె ప్రేమాయణం సాగిస్తున్న విషయం ఇన్నేళ్లూ ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలిశాక అంతా షాక్‌లో ఉన్నారు. తన ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేకంగా చికెన్ కర్రీ వండిపెట్టింది అత్త. అతని భార్య (తన కూతురు), మామగారు (భర్త)కు మాత్రం మటన్ కర్రీ వండి పెట్టింది. ఆ మటన్ కర్రీలో నిద్రమాత్రలు కలిపింది. తాను మాత్రం నిద్రమాత్రలు కలపని చికెన్ కర్రీని తింది. లంచ్ సందర్భంగా.. మామగారికి బాగా మద్యం తాగించాడు అల్లుడు.

భోజనం తర్వాత భార్య, మామగారూ నిద్రమత్తులోకి జారుకున్నారు. అదే సరైన టైమ్ అని భావించిన అత్త.. అల్లుడితో విదేశాలకు చెక్కేసింది. వాళ్లిద్దరి మధ్యా 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. సాయంత్రం 4 గంటలకు నిద్రలేచిన మామకి దిమ్మతిరిగింది. ఎక్కిందంతా దిగిపోయింది. తన భార్య, అల్లుడూ కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు రమేష్. తన కూతురు కిస్నాను నారాయణ్ జోగికి ఇచ్చి పెళ్లి చేశాడు.

కానీ అల్లుడు తన భార్యను ప్రేమిస్తున్నాడనీ, తన భార్య కూడా అతన్ని ప్రేమిస్తోందని ఏనాడూ అతను అనుకోలేదు. అంత రహస్యంగా ఈ లవ్ స్టోరీ నడిచింది. పెళ్లి తర్వాత కూతురు, అల్లుడు తరచూ అత్తమామల ఇంటికి వచ్చి వెళ్లేవారు. కొన్నాళ్లు ఇలా అయ్యాక.. భార్యను తీసుకొని విదేశానికి వెళ్లిపోయాడు నారాయణ్. గతేడాది డిసెంబర్ 30 చివరిగా అత్తారింటికి భార్యతో వచ్చాడు. ఆ తర్వాత ఈ డ్రామా నడిచింది.

అనదర పోలీసులు కేసు రాశారు. నారాయణన్‌ను విదేశాల నుంచి భారత్‌కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఇండియా వచ్చాక అతనికీ, అత్తగారికీ కౌన్సెలింగ్ ఇస్తామని అంటున్నారు. ఐతే.. ఈ ఘటన స్థానికంగా అందరికీ తెలిసింది. ఇంటి పరువు పోయింది. అందరూ విషయం తెలుసుకొని.. అవ్వ.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజం ఎటు పోతోందని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker