News

30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వీరందరినీ వెతికి పట్టుకొని వచ్చి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి డూప్ గా చేస్తోన్న వ్యక్తికి ఆదరణ లభిస్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారట. అంతేకాదు.. ప్రేమ్ కుమార్ కి రికార్డింగ్ డాన్స్ పేరుతో ఓ కంపెనీ కూడా ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో రియల్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించి అభిమానుల గుండెల్లో సుప్రీం హీరో నుంచి మెగాస్టార్‌గా కొలువైన సంగతి తెలిసిందే కదా.

ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. 67 యేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా తనదైన డాన్సులతో నటనతో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు కుర్ర హీరోలకు ధీటుగా తన డాన్స్. ఫైట్స్‌తో అలరిస్తూనే ఉన్నారు. ఇక ఈయన చేసే రియల్ స్టంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు వయసు రీత్యా ఫైట్స్ విషయంలో అంతగా రిస్క్ తీసుకోవడం లేదు.

ఇక చిరంజీవికి గత 30 యేళ్లుగా ఓ వ్యక్తి డూప్‌గా నటిస్తున్నారు. ఎపుడు రియల్ ఫైట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే చేసే హీరోలు అప్పుడ‌ప్పుడు డూప్‌ల‌తో త‌మ స‌న్నివేశాల‌ను చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని రిస్కీ షాట్‌ల‌ను చేసేందుకు చాలా మంది హీరోలు సాహ‌సించరు. అలాంటి స‌మ‌యంలో డూప్‌ల‌తో ఆ స‌న్నివేశాల‌ను కానిచ్చేస్తారు ద‌ర్శ‌క‌నిర్మాతలు. అయితే అంత రిస్కీ సీన్లు చేసినా ఇదివ‌ర‌కు వారి గురించి పెద్ద‌గా ఎవ్వ‌రికీ తెలిసేది కాదు. అయితే సోష‌ల్ మీడియా విరివిగా వాడుతున్న ఈ కాలంలో డూప్‌ల గురించి కూడా బాగా తెలుస్తోంది.

ఇక కొన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల నిర్వాహ‌కులు వారిని లైమ్‌టైమ్‌లోకి తీసుకొస్తుండంతో హీరోల డూప్‌ల‌కు ఇప్పుడు ఆద‌ర‌ణ బాగా ల‌భిస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి డూప్‌గా చేసేది ఎవ‌రో తెలుసా..? ఆయ‌న పేరు.. ఏ ఊరో తెలుసా..? ఈ విష‌యాల‌న్నీ రీసెంట్‌గా ఓ షోలో రివీల్ అయ్యాయి. ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ఆ మ‌ధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కొత్త షోను స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. కొన్ని ప్రాంతాల‌కు వెళ్తోన్న ఈ షో నిర్వాహ‌కులు అక్క‌డి టాలెంట్‌ని బయ‌ట‌కు తీస్తున్నారు. ఈ క్ర‌మంలో మొద‌టిసారిగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు వెళ్లారు. అక్క‌డ ఈ షోలోకి చిరంజీవి డూప్ వ‌చ్చారు.

ఆయ‌న పేరు ప్రేమ్ కుమార్. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారు. అంతేకాదు ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయ‌న‌కు ఒక కంపెనీ ఉంది. ఇక షోలో వ‌చ్చిన ఆయ‌న‌.. రికార్డింగ్ డ్యాన్స‌ర్లంటే చాలా చిన్న చూపు ఉన్న విషయం చెప్పుకొచ్చారు. వారికి ఆద‌ర‌ణ స‌రిగా ల‌భించ‌లేదు అంటూ ఆవేద‌న వ్యక్తం చేశారు. త‌మ లాంటి వాళ్ల‌కు ఒక ఫ్లాట్‌ఫామ్‌ని ఇస్తోన్న ఈటీవీ వారికి కృత‌ఙ్ఞ‌త‌ల‌ని ప్రేమ్ కుమార్ అప్పట్లో చెప్పుకోవడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. ఏజ్ 67 అయినా.. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. ఇక ఈయన జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. అదేం జోరు సామీ అంటూ పండగ చేసుకుంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker