Uncategorized

చీ.. ఏడో నెలలో ఇదేం పని. గర్భవతి అని మరిచి పబ్ లో అమలాపాల్ డాన్స్..!

హీరోయిన్ అమలా పాల్ విషయంలో కూడా అలానే అనిపిస్తుంది ఇప్పుడు అందరికీ..! రీసెంట్గా తాను కన్వీస్ అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన అమలా.. ఎట్ ప్రెజంట్ తాను కడుపుతో ఉన్నా కూడా.. తన అప్ కమింగ్ ఫిల్మ్ ది గోట్ లైఫ్ కోసం కష్టపడుతోంది. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. అయితే టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయమే. రామ్ చరణ్ ‘నాయక్’, ‘ఆమె’, ‘పిట్ట కథలు’ వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.

హీరోయిన్ గా వెండితెరపై అలరించడమే కాకుండా ఆయా వెబ్ సిరీస్ లు, ఓటీటీ ఫిల్మ్స్ ల్లో బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. విభిన్న పాత్రలు పోషించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. అమలా పాల్ కొన్నాళ్లుగా సినిమాల కంటే తన పర్సనల్ విషయాలనూ షేర్ చేసుకుంటూనే అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఈ క్రమంలో తన పెళ్లి వార్తను చెప్పి సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.

అమలాపాల్ గతేడాది రెండో పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ తో 2023 నవంబర్ 5న వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఆ కొద్ది రోజులకే తన ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు చెప్పి తన అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. గర్భవతిగా తన ఆరోగ్యం గురించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. బెబీ బంప్ ఫొటోలను షేర్ చేసుకుంటూ.. భర్తతో సమయం గడుపుతూ కనిపిస్తోంది.

అయితే తాజాగా మాత్రం ఏడు నెలల గర్భంతో అమలాపాల్ ఓ పబ్ లో డాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. భర్తతో కలిసి స్టెప్పులు వేయడంతో నెటిజన్లు ఆందోళన పడుతున్నారు. ‘యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా?’ అంటున్నారు. కాస్తా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం కపుల్ గోల్స్ అంటూ వారిని సమర్థిస్తున్నారు. మొత్తానికి ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker