News

చిరంజీవి నిజంగా సిల్క్ స్మితను కొట్టడానికి అసలు కారణమిదా..!

చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య జరిగిన విషయాన్నీ బయట పెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.ఈయన మాట్లాడుతూ. చిరంజీవి, సిల్క్ స్మిత కాంబోలో ఎన్నో ఐటెం సాంగ్స్ వచ్చాయి అనే విషయం తెలిసిందే. అయితే ఒక సినిమాలో చిరంజీవి షూట్ లో భాగంగా సిల్క్ స్మితను కొట్టే సీన్ ఒకటి ఉంది. అయితే అప్పటి జనాలకి చిరంజీవి అంటే అంతటి పిచ్చి అభిమానం ఉండేది. కాబట్టే చిరంజీవి వాళ్లని ఎప్పుడు నిరాశపరచకుండా వాళ్ళు ఎలాంటి చిరంజీవిని అయితే తెరపైన చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలనే చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతూ వచ్చాడు.

ఇక ఇలాంటి చిరంజీవి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చేసిన ముఠామేస్త్రి సినిమా సమయంలో అప్పట్లో ఐటెం సాంగ్ డాన్సర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సిల్క్ స్మిత ని కొట్టాడు అనే వార్తలైతే చాలా ఎక్కువగా వినిపించాయి. ముఠామేస్త్రి సినిమాలో మొదటి సాంగ్ లో సిల్క్ స్మిత చిరంజీవితో ఆడిపాడింది. అయితే ఈ సాంగ్ షూట్ జరిగే సమయంలో ఆ సినిమా సెట్ కి తాగేసి వచ్చిన సిల్క్ స్మిత అక్కడున్న డైరెక్షన్ టీం తో గాని, రైటర్లతో కానీ గొడవకు దిగిందట..

వాళ్లు ఎంత వద్దు అని చెప్పిన కూడా ఆమె తగ్గలేదట.. దాంతో అక్కడున్న ఒక వ్యక్తి చిరంజీవి గారు వచ్చాక మీ సంగతి చెప్తారు అని అనడంతో చిరంజీవికి నా సంగతి చెప్పెంత సీను లేదు అని చిరంజీవి గురించి కూడా మరి ఓవర్ గా మాట్లాడడంతో, చిరంజీవి వచ్చి ఎంత కామ్ గా ఉండమని చెప్పిన కూడా తాను వినకుండా అల్లరల్లరి చేస్తూ సెట్ అంతా పిచ్చిపిచ్చిగా చేయడంతో ఆమెను చిరంజీవి రెండు దెబ్బలు కొట్టి అక్కడి నుంచి పంపించాడట.

దాంతో అప్పట్లో ఈ న్యూస్ మీడియా లో వచ్చింది. అయినప్పటికీ చిరంజీవి కావాలని ఆమెను కొట్టలేదు. ఇక చిరంజీవి అలా చేయకపోతే ఆమె అక్కడ ఇంకా రచ్చ రచ్చ చేసేదట, కెమెరాలను పగలగొట్టడానికి కూడా వెళ్ళింది అంటూ ఆ సెట్లో ఉన్న చాలామంది ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker