News

అంబానీకి కాబోయే కోడలి గురించి బయటకి తెలియని షాకింగ్ విషయాలు ఇవే.

గత ఏడాది ముంబైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌కు కూడా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. మరి ముకేశ్ అంబానీ నివాసం యాంటిల్లాలో ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు రాధికా మర్చంట్ కుటుంబ సభ్యులను ఎంత ఘనంగా ఆహ్వానించారో తెలుసా..? బాజా భజంత్రి నడుమ తమ కాబోయే కోడలు రాధికను అంబానీ ఫ్యామిలీ వెల్‌కమ్ చెప్పింది. అయితే అంబానీకి కాబోయే కోడలు రాధికా 1994, డిసెంబర్ 18న జన్మించారు.

వీరెన్ మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓగా ఉన్నారు. ఇది ప్రముఖ ఫార్మాష్యూటికల్ సంస్థల్లో ఒకటి. భారత్‌లోని అత్యంత ధనవంతుల్లో వీరెన్ కూడా ఒకరు. రాధికా మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాథెడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్‌లో విద్యను అభ్యసించారు. ఇక BD సోమని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ డిప్లొమా పొందారు.

2017లో న్యూయార్క్‌ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ Isprava లో జూనియర్ సేల్స్ మేనేజర్‌గా పనిచేశారు. అంతకుముందు దేశాయ్ అండ్ దీవాన్‌జీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేశారు. రాధికా మర్చంట్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కులు వంటి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ.

రాధికాకు తన కాబోయే అత్త నీతా అంబానీ మాదిరిగా.. సంప్రదాయ భారతీయ నృత్యం.. భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ముకేశ్ అంబానీ కుటుంబం 2022 లో జియో వరల్డ్ సెంటర్‌లో దగ్గరుండి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఇందులో అరంగేట్రం కూడా చేశారు. ఎందరో ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్‌‌లో ఆమె ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker