ఆత్మహత్య చేసుకోవాలనుకున్న షణ్ముఖ్, దానికి ఆమె కారణమా..?
షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పై మౌనిక అనే యువతి కేసు పెట్టింది. ప్రేమ పేరుతో మోసం చేశాడు. తనను పెళ్లి చేసుకోకుండా వేరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ కోసం ఫ్లాట్ కి వెళ్లిన పోలీసులు అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ ఉండటం గమనించారు. ఆ ఇంట్లో గంజాయి కూడా కొంత పరిమాణంలో స్వాధీనం చేసుకున్నారు.
అయితే యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తరువాత యూట్యూబ్ లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్లు హిట్ కావడంతో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఇక మొదటి నుంచే దీప్తి సునయన తో అతడు ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు. బిగ్ బాస్ లోకి మొదట దీప్తి వెళ్ళినప్పుడు.. ఆమె వేరొకరితో చనువుగా ఉందని, షన్ను ఆమెపై ఫైర్ అయ్యి కొద్దిరోజులు దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
ఇక షన్ను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సిరితో క్లోజ్ గా ఉండడం, బయటకు వచ్చాకా దాని గురించి ఈ జంట గొడవపడటంతో వీరి మధ్య ఉన్న బంధం ముక్కలయింది. బిగ్ బాస్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటారు అనుకున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి షన్ను డిప్రెషన్ లో ఉన్నాడా ..? అనేది తెలియాల్సి ఉంది. ఇక దాని తరువాతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు.
అప్పుడు కూడా షన్ను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు షన్ను.. తన నోటి నుంచే తాను డిప్రెషన్ లో ఉన్నట్లు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. షన్ను మానసిక పరిస్థితి బాలేదని తెలుస్తోంది. ఇదంతా చూసిన షన్ను అభిమానులు.. దీప్తితో బ్రేకప్ కారణంగానే షన్ను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.