News

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ మొత్తం పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా..?

జూలైలో అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల పెళ్లి జరగనుండగా.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. మార్చి 1-3 వరకు మూడు రోజుల పాటు.. గుజరాత్‌, జామ్‌నగర్‌ వేదికగా.. అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు ఇండియా నుంచే కాక.. ప్రపంచ దేశాల నుంచి అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అయితే అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకకు చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు. షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ, రాణి ముఖర్జీ, రణ్ వీర్-దీపిక. ఆలియా భట్ దంపతులు.. ఇలా అపర కుబేరుడి పెళ్లింట్లో.. బాలీవుడ్ ప్రముఖులు సందడి చేస్తున్నారు.

మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్‌ హెవెన్. కానీ.. బిగ్ మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ ‘అంబానీస్ కాంపౌండ్’ అన్నట్లు ఉంది అక్కడి సీన్. అనంత్ అంబానీ వెడ్స్ రాధికా మర్చంట్.. ప్రీ-వెడ్డింగ్ కోసం రెడ్‌కార్పెట్ సెరిమనీ అదరహో రేంజ్‌లో షురూ అయ్యింది. ఇది వెయ్యి కోట్ల పెళ్లి అని చాలామంది చెబుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీవెడ్డింగ్ సెషన్‌ కోసం అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు కుమ్మరిస్తోందట అంబానీ ఫ్యామిలీ. 2018లో ఆకాశమంత పందిరేసి కూతురు ఇషా పెళ్లిని జరిపించారు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ.

ఇటలీలోని కోమో అనే అందమైన సరస్సు తీరంలో జరిగిన ఈ పెళ్లికైన ఖర్చు 828 కోట్లు. అప్పట్లో ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మేరేజ్. ఆ రికార్డును మళ్లీ అదే అంబానీ ఇంట బ్రేకవుతోంది. బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, ధోని.. ప్రపంచంలోని రిచీరిచ్చులంతా గుజరాత్ వైపు దారితీశారు. దీపిక-రణ్‌వీర్‌సింగ్, ఆలియా-రణబీర్ దంపతులు.. షారూఖ్‌ఖాన్, అక్షయ్‌ ఖన్నా.. ఇండియన్ గ్లామర్ కటౌట్లన్నీ అక్కడే.

జామ్‌నగర్లోని రిలయన్స్ రిఫైనరీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 3 వేల ఎకరాల బ్యూటిఫుల్ గార్డెన్ .. అనంతుల వారి పెళ్లి ముందస్తు వేడుకలకు ఇదే జబర్దస్త్ వేదిక. కోటి దాకా చెట్లున్న ఈ అందమైన మామిడితోట… అంబానీ వారి జంతు సంరక్షణ శాల కూడా. ప్రపంచవ్యాప్తంగా 2 వేల జంతువులకు అంబానీ వారు కల్పించిన ఆవాసం ఇది. సో.. గెస్టులందరికీ అదోరకం తన్మయత్వం గ్యారంటీ. అయితే

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker