News

ఇమ్మాన్యుయేల్ తో వర్ష పెళ్లిపై ఓపెన్ గా చెప్పేసిన వర్ష, షాక్ లో ఇమ్ము.

బిగ్​బాస్​లోకి రమ్మంటూ మూడుసార్లు తనకు ఆఫర్ వచ్చిందన్నారు వర్ష. కానీ తాను వెళ్లలేదని.. వెళ్లేందుకు ఇంకా టైమ్ ఉందని అనుకుంటున్నానని చెప్పారు. తాను గొడవలకు దూరంగా ఉంటానన్నారు. ఇమ్మానుయేల్​తో మ్యారేజ్ విషయం గురించి ఎందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. అయితే “ఇమ్మాన్యుయెల్ తో పెళ్లి ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు? నేను గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి..ఇమ్మాన్యుయెల్ నాతో పనిచేసే ఆర్టిస్ట్ కాబట్టి.. క్లోజ్ గా ఉంటే అలా రాస్తారా? పెళ్లి ఎప్పుడు అని అడుగుతారా?

అసలు నేను అతడిని పెళ్లి చేసుకునే విషయాన్ని మీకు ఎందుకు చెప్పాలి? అతనితో వివాహం జరిగిన జరగకపోయినా షో ల్లో నటిస్తూనే ఉంటాను. నాకు నటన తప్ప మరోటి రాదు. చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను. నాతోపాటు నటించే ఆర్టిస్టులతో క్లోజ్ గా ఉంటే అదే అవుతుందా? ఇమాన్యుయల్ తో నా కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకే మీడియా మా మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఏది ఏమైనప్పటికీ అభిమానులు నాకు అండగా ఉండాలి. వారు ఇచ్చిన ప్రోత్సాహం ద్వారానే ఇక్కడి దాకా వచ్చాను” అంటూ వర్ష వ్యాఖ్యానించింది.

ఇదే సమయంలో వర్ష బిగ్ బాస్ షో లో తనకు వచ్చిన ఆఫర్ గురించి కూడా ప్రకటించింది..” నన్ను బిగ్ బాస్ షోలో చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కాకపోతే నేను చాలా సెటిల్డ్ రకం..ఎవరి తోనూ గొడవలు పెట్టుకోను. అలా గొడవలు పెట్టుకుంటే తర్వాత వారితో మాట్లాడడం ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా నాకు వంట చేయడం రాదు. వంట చేయడం రాకపోతే బిగ్ బాస్ షోలో గేలి చేస్తారు. అందుకే అందులోకి వెళ్ళలేదు. అయితే వచ్చే సీజన్లో అందులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

మొన్నటిదాకా కొన్ని సీరియల్స్ లో నటించాను. ఇప్పుడిక అందులో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను. కేవలం షో స్ మాత్రమే చేస్తాను. ఇమాన్యుయేల్ తో వివాహం జరిగినా, జరగకపోయినా నేను నటిస్తున్న షో స్ చూడండి. ఎందుకంటే అభిమానుల వల్లే ఇక్కడి దాకా వచ్చాను.” అని వర్ష పేర్కొంది. మొత్తానికి తనకు ఇమాన్యుయల్ కు ఏం ఉందో, ఆ రిలేషన్ ఎక్కడిదాకా కొనసాగుతుందో వర్ష తన వ్యాఖ్యల ద్వారా బయటపెట్టింది. ఇక ఇప్పటికైనా మీడియా ఆ రూమర్లకు చెక్ పెడుతుందో చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker