News

మీకు ఎంతకీ పెళ్లి కావడం లేదా..! ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శించుకొని చుడండి. తొందలోనే పెళ్లి అవుతుంది.

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే నంద్యాల జిల్లా ఓంకార క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారు స్వయంభుగా వెలిశారు. ఓంకారంలో ఉన్న స్వామి వారికి నుదుటన కుంకుమ పెట్టారు. ఇక్కడ అమ్మవారికి మన కోరికలు గట్టిగా అమ్మవారికి చెప్పుకున్నట్లయితే అవన్నీ నెరవేరుతాయని ప్రజల గట్టి నమ్మకం.

ఇక్కడికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో శ్రీ ఉమామహేశ్వర అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం కోసం వస్తుంటారు. వివాహం, ఆనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ప్రజలు ఎప్పుడూ నమ్ముతూనే ఉంటారు. అదేవిధంగా వచ్చిన భక్తాదులందరూ మనం మన ఇంట్లో ఆడపడుచులకు ఏ విధంగా అయితే ఒడి బియ్యం పోస్తామో అలా గాజులు, పండ్లతో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి పూజ చేస్తారు. మన ఇంటి ఆడబిడ్డ లాగా ప్రతి ఒక్కరూ అమ్మవారికి కొత్త చీర, గాజులు, పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారిని తయారు చేస్తారు.

ఓంకార క్షేత్రంలోశ్రీ ఉమామహేశ్వర అమ్మవారికి శ్రీ చక్రమును, ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించారు. ఆదిశంకరాచార్యులు అనగా మన హిందూ సంస్థకు మూలమైన గురువు అయినందుకు ఓంకార క్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిష్టించారు. ఓంకార క్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు శ్రీ చక్రానికి పూజా కార్యక్రమాలు, పూలు తదుపరి అన్నింటిని సమర్పిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని తెలిపారు ఉమామహేశ్వర అమ్మవారికి ప్రతి మంగళవారం, శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మహా మంగళ హారతి, కుంకుమార్చన, ఇలాంటివి ఎన్నో మహా విశిష్టత పూజా కార్యక్రమాలు చేస్తుంటారు . కార్తీకమాసం, పౌర్ణమి, శివరాత్రి సమయాలలో, అమ్మవారికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం లభిస్తుందో శివరాత్రి సమయాలలో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా అంతే పుణ్యం కలుగుతుందని, పూజారి చక్రపాణి శర్మ తెలియజేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker